Off The Record: మంచిర్యాల కాంగ్రెస్లో ఆధిపత్య పోరు!
Off The Record: మంచిర్యాల కాంగ్రెస్లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య మొదలైన ఇంటిపోరు, తెరవెనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు ఆసక్తికరమైన మలుపుల పూర్తి సమాచారం.
Off The Record: మంచిర్యాల కాంగ్రెస్లో ఆధిపత్య పోరు!
Off The Record: రాజకీయాల్లో శత్రువు బయట ఉంటే ఒక లెక్క. ఇంట్లోనే ఉంటే మరో లెక్క..! మంచిర్యాల కాంగ్రెస్లో..ఇప్పుడు అలాంటి ఇంటిపోరే నడుస్తోంది. జిల్లా కేంద్రంలో మంత్రి ఆధిపత్యానికి బ్రేక్లు వేయాలని ఎమ్మెల్యే చూస్తుంటే.. అసలా ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుకే చెక్ పెట్టాలని మంత్రి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడట.
తన నిజయోవర్గంలోకి మంత్రి అడుగుపెట్టకుండా ఎమ్మెల్యే గడపలు మూసేస్తే.. మంత్రి మాత్రం ఎమ్మెల్యే ఇంటి గడపలోని మనిషినే రాజకీయ అస్త్రంగా మార్చారట..? ఒకప్పుడు ఎమ్మెల్యేకు కుడిభుజంగా ఉన్న నాయకుడే... ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కొత్త బలంగా మారాడట..? మంచిర్యాల కాంగ్రెస్లో నిశ్శబ్దంగా మొదలైన ఈ రాజకీయ చెస్ గేమ్... ఇప్పుడు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.
Next Story




