Jordar News: మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్
Jordar News: దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి వద్ద పేరుకుపోయిన చెత్తను, పిచ్చిమొక్కలను తన అభిమానులతో కలిసి స్వయంగా శుభ్రం చేయించిన హీరో మంచు మనోజ్.
Jordar News: మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్
Jordar News: మంచు మనోజ్ సారుకు ఈ అడ్విల పనేంది అని పర్వాన్ గాకుర్రుల్ల. ఇది అడ్వి గాదు.. ప్రేమాభిషేకం, మేఘసందేశం, ఒసేయ్ రాములమ్మ, కంటి కూతురునే కను అసోంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు సారు స్మారక స్థలం.. అంటే గదేనుల్ల.. దాసరి సారు ఆఖరు కార్యం జరిగిన జాగ గది. ఈన్నే సారు సమాధి ఉన్నది. కని, శానేద్దుల సంది ఇటు మొకాన ఎవ్వలు పోకపోయేటాల్లకు.. ఇగో ఇట్ల అడ్వి లెక్క మారింది. ఇగీ ముచ్చట సోషల్ మీడియాల వైరల్ అయ్యేటాల్లకు మంచు మనోజ్ సారుకు శానా బాధ అనిపించిందట.. అసల్కే తండ్రి మోహన్ బాబు సారుకు దాసరి సారంటే మస్తు పాయిరముంటది.
అసోంటి దాసరి సారు స్మారక స్థలం ఇసోంటి పరిస్థితిల ఉన్నదని తెల్చేటాల్లకు అభిమానులను ఎంబడేస్కోనచ్చి శెట్లు కొట్టి, చెత్త మొత్తం సాఫు జేసి, దాసరి సారు ఘాటను నీటుగ తీర్చి దద్దిండు మనోజ్ సారు ఇయ్యాల్ల. అంతేగాదుల్లో.. గీతా ఆర్ట్స్ సంస్థ సుతం ఈ కార్యంల భాగమైందట. శుభ్రం జేసుడు కార్యమంత పూర్తయినంక దాసరి సారు విగ్రహానికి పూల మాలలేశి ఘనంగ నివాళి సుతం వట్టిర్రు. అట్లిప్పుడు మంచు మనోజ్ సారు జేసిన ఈ మంచి పనిని మస్తు తారీఫ్ జేస్తున్నరు దాసరి సారు అభిమాన్లు. ఈనడ్మ తాపకో మంచి కార్యం ముంగటేస్కుంటాున్న మంచు మనోజ్ సారు ఇట్లనే ఇంకా మంచి మంచి పనులెన్నో జెయ్యన్సని మా జోర్దార్ వార్తల తర్పుగ గుడ కోరుకుంటున్నం.




