Jordar Varthalu: హైదరాబాద్ లో పేషెంట్.. చైనాలో డాక్టర్.. ఆపరేషన్ సక్సెస్

Jordar Varthalu: వైద్యరంగంలో సంచలనం! హైదరాబాద్‌లో ఉన్న 57 ఏళ్ల మహిళకు చైనా నుంచి డాక్టర్ ‘టెలి రోబోటిక్ సర్జరీ’ ద్వారా విజయవంతంగా ఆపరేషన్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 May 2026 7:02 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: హైదరాబాద్ లో పేషెంట్.. చైనాలో డాక్టర్.. ఆపరేషన్ సక్సెస్

Jordar Varthalu: టెక్నాలజీ సల్లగుండ ఇంతింతై వటుడింతై అన్నట్టే పెర్గుతున్నది గద. కావు అనుకున్న పనులను అల్కగ చేశి మన్శుల పానాలను దక్కిస్తున్నది టెక్నాలజీ. లేటెస్టు రోబో టెలీ సర్జరీ టెక్నాలజీతోని పట్నంలున్న పేశెంటుకు, శైనాలున్న డాక్టర్లు పానం పోశిర్రు. పెద్ద పెద్ద ఆప్రేషన్లంటే.. మనోల్లు బైటిదేశాలకు పోవాల్శొస్తుండె. పైసలు గూడ ఎక్వైతుండే. టైం గూడ బగ్గ వడ్తుండె. ఇగ అట్ల గాకుంట.. రోబోటిక్ టెలీసర్జరీ టెక్నాలజీ వాడి ఉన్న కాన్నుంచే బైటి దేశాల డాక్టర్లతోని వైద్యం జేపిచ్చిర్రు. అది గూడ ఏదో పేరు వోయెతందుకు చేశ్నమా అన్నట్టు గాకుంట.. పేషెంటు పానాలను నిలవెట్టెతట్టు జేశి శభాష్ అనిపిచ్చుకుంటున్నరు డాక్టర్లు. అసలు ముచ్చటేందంటే.. పట్నం దిక్కుండే ఒగ 57 ఏండ్ల అవ్వ మూPత్రనాళాలు మూస్కపొయ్యి గోసపడ్తున్నదట. స్టంట్లు ఏశిర్రట కని, కొద్ది రోజులకు మల్లా మొదటికచ్చిందట పర్శాను. ఇగిట్లైతే కల్వదని, పట్నంలున్న ఏషియన్ ఇన్ స్టిట్యూట్ డాక్టర్లను కలుస్తె.. శాశ్వతంగ బాగు జేశే ఉపాయం జేశిర్రు.

పట్నంల రోబో మిశిన్లున్నయట కని.. ఈడ పన్జేశే సీనియర్ డాక్టర్ గౌస్ సార్ చైనా దేశం వుహాన్లున్నడట. ఇగ అంత దూరం అవ్వను తీస్కపోవుడు అయ్యే పని కాదని, సారు పన్జేస్తున్న కాడ.. ఉన్న రోబోలను వాడి ఆన్నుంచే ఆప్రేషన్ జేశే ఉపాయం జేశిండు. ఇక్కడ పేశెంట్ తాన రోబోలను కెమ్రాలను ఉంచిర్రు. హైస్పీడ్ ఇంటర్నెట్ తోని శైనాకు లైన్ కల్పిర్రు. ఇగాడ గౌస్ సారు, కెమ్రాల సూసుకుంట రోబోకు ఆడర్లేసుకుంట ఆప్రేషన్ సక్సెస్ జేశిండు. గంటన్నరల ఆప్రేషన్ కథం జేశిర్రట. అవ్వ తాన సుతం పెద్ద పెద్ద డాక్టర్లు సుట్టుముట్టుండి, ఎప్పటికప్పుడు మంచి శెడ్డలు సూసుకున్నరు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, బడాబడా యాపారులు బైటి దేశాలకు పొయ్యి పెద్ద పెద్ద ఆప్రేశన్లు జేపిచ్చుకుంటుండె కనీ.. ఇగ రేపు రేపు అంత దూరం పోవాల్శిన పనిలేకుంటైతదని అంటున్నరు డాక్టర్లు. ప్యాదబిక్కోల్లు సుతం అగ్వల అల్కగ వైద్యం జేపిచ్చుకునే సౌలత్లు అస్తున్నయని అంటున్నరు. రాబోయేదంత రోబోటిక్ టెలీ సర్జరీల కాలమే అని గర్వంగ జెప్తున్నరు డాక్టర్లు. ఏమాటకామాటనే కని టెక్నాలజీతోని ఎంత పర్శానుందో.. అంతే మంచిగుడైPPతున్నదుల్లా. శీమకండ్ల శైనోల్ల లెక్క మనంసుతం టెక్నాలజీని మంచికి వాడ్తె.. మనలను మించినోల్లు ఉండరు కావచ్చు పోర్రి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story