మెగాస్టార్ జాతకంలో ఉన్న రాజయోగాలేంటి? జ్యోతిష్య నిపుణుడు కళానిధి రాంబాబు సంచలన విశ్లేషణ

Megastar Chiranjeevi: చిరంజీవి జాతకం, గురు మహర్దశ, రాజయోగాలు మరియు ఆయన రాజకీయ ప్రయాణంపై జ్యోతిష్య నిపుణులు కళానిధి రాంబాబు అందించిన పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 22 Aug 2026 12:12 PM IST
మెగాస్టార్ జాతకంలో ఉన్న రాజయోగాలేంటి? జ్యోతిష్య నిపుణుడు కళానిధి రాంబాబు సంచలన విశ్లేషణ
X

మెగాస్టార్ జాతకంలో ఉన్న రాజయోగాలేంటి? జ్యోతిష్య నిపుణుడు కళానిధి రాంబాబు సంచలన విశ్లేషణ

Megastar Chiranjeevi: తెలుగు చిత్రసీమను ఐదు దశాబ్దాలుగా తన ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి జీవితంలో సాధించిన అసాధారణ విజయాల వెనుక బలమైన జ్యోతిష్య కారణాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కళానిధి రాంబాబు తెలిపారు. చిరంజీవి జాతకంలో ఉన్న అరుదైన రాజయోగాలు, గురు మహర్దశ ప్రభావంపై ఆయన ఆసక్తికర విశ్లేషణ అందించారు.

2000వ సంవత్సరంలోనే తాను విజయ బాపినేడు గెస్ట్ హౌస్‌లో చిరంజీవిని కలిసి ఆయన జాతకం చెప్పినట్లు కళానిధి రాంబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాను రాజకీయాల్లోకి రానని చిరంజీవి చెప్పినప్పటికీ.. జాతక బలం ప్రకారం ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, కేంద్ర మంత్రి కావడం జరిగిందని తెలిపారు.

1977 నుండి 1993 వరకు నడిచిన 16 ఏళ్ల గురు మహర్దశ చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని జ్యోతిష్య పండితులు తెలిపారు. చిరంజీవి జాతకంలో లగ్నంలో శని ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల శశ మహాపురుష యోగం, కర్మస్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల హంస మహాపురుష యోగం వంటి అరుదైన రాజయోగాలు ఏర్పడ్డాయి. 1983లో వచ్చిన 'ఖైదీ' చిత్రం సమయానికి గురు మహర్దశలో బుధుడి అంతర్దశ నడవడంతో ఆయన తిరుగులేని స్టాడమ్‌ సాధించి మెగాస్టార్‌గా అవతరించారు.

1993 తర్వాత ప్రారంభమైన శని మహర్దశ కాలంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఎమ్మెల్యేగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అయితే, ఆయన నవాంశ చక్రంలో శని నీచ స్థానంలో ఉండడం మరియు దశమాధిపతి అయిన చంద్రుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల రాజకీయాల్లో సుదీర్ఘకాలం కంటిన్యూ కాలేకపోయారని విశ్లేషించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story