Jordar Varthalu: తాటిముంజలు కోసిన మంత్రి పొన్నం.. సంతోషంగా తిన్న కార్యకర్తలు

Jordar Varthalu: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ పర్యటనలో అరుదైన దృశ్యం! దారి పక్కన ఆగి స్వయంగా తాటి ముంజలు కోసి కార్యకర్తలకు తినిపించిన మంత్రి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 8:01 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: తాటిముంజలు కోసిన మంత్రి పొన్నం.. సంతోషంగా తిన్న కార్యకర్తలు

Jordar Varthalu: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సారు ఏకంగ కత్తి వట్టి మరీ తాటి ముంజలు తీశి పక్కపొంటోల్లకు ఇస్తున్నడుగదా. మరిగ సారు శిన్నప్పుడు తాటిశెట్లు ఎక్కిండో లేదో తెల్వదిగనీ., శిన్నప్పటి సంది కత్తి వట్టి ముంజకాయలు కోశ్న అల్వాటైతే ఉన్నట్టే అన్పిస్తున్నది సూస్తుంటే. హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనకు పోయ్న మంత్రి పొన్నం సారుకు... తొవ్వ బందుకు తాటి ముంజలు అమ్ముతున్నోళ్లు కానరాంగనే కారు పక్కకు ఆపిండు. సీదా ఆ అన్న దగ్గరికి వోయి కత్తి తీస్కోని మరీ ముంజలు తీశిండు. ఇగ దీన్ని అక్కడున్నోళ్లు ఎవ్వలో వీడియో తీశి సోషల్ మీడియాల వెడ్తే ఇప్పుడీ వీడియో మస్తు వైరల్ అయితున్నది. ఇగీ ముంజలు తింటుంటే., మంత్రి పొన్నమన్నకు శిన్ననాటి రోజులు యాదికచ్చినయో ఎట్లనో తెల్వదిగనీ., మంత్రి హోదాలున్నోళ్లైనా., ఎవ్వలైనా తాటి ముంజలను సూస్తే మాత్రం ఖచ్చితంగ ఆగాల్సిందే. ఓ నాలుగు ముంజలు తినాల్సిందే అన్నదాన్ని మంత్రి పొన్నమన్న రుజవు జేశిండని అనవట్టిర్రు ఈ వీడియో సూశ్నోళ్లు. అన్నట్టు తాటిముంజలు తింటే పాణానికి శానా మంచిదటనుల్లా. ఎండాకాలం పెయ్యికి సలువ జేస్తదట. మరీ ముఖ్యంగ ఏం గింత గుడ మందులు లేకుంట పూర్తి ఆర్గానిక్ గ కాస్తయి ముంజకాయలు. కావట్టి., పబ్లిక్కు.. మీకు సుతం తాటిముంజలు ఎక్కడ కానచ్చినా తప్పకుంట తినుర్రి. సరేనా.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story