Jordar Varthalu: “శాతావాహన” అడ్మిషన్ల కోసం మంత్రి పొన్నం
Jordar Varthalu: ప్రభుత్వ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ! హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రచారం చేపట్టారు.
Jordar Varthalu: “శాతావాహన” అడ్మిషన్ల కోసం మంత్రి పొన్నం
Jordar Varthalu: మామూలుగైతే జాతర పోస్టర్లనో, జాబ్ మేళ పోస్టర్లనో ఆవిష్కరిస్తుంటరు లీడర్లు.. కని, నెవ్వర్ బీఫోర్ అన్నట్టు హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం నడుం కట్టిండుల్ల మంత్రి పొన్నం సారు ఇయ్యల్ల. సచివాలయంల ప్రెస్మీట్ పెట్టి మరీ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్ల కోసం ప్రచారం జేశిండు సారు. ఏపీల గదా ప్రవేటు బడులకు పోటీగ ప్రభుత్వ బడులకు అడ్వర్టయిజులు ఇచ్చినట్టే ప్రైవేట్ కాలేజీల స్టైళ్ల శాతావాన యూనివర్సిటీ పోస్టర్లుె విడ్దలజేశి మరీ అటెంక ఇగో ఇట్ల మాట్లాడుచ్చిండు సారు.
మామూలుగైతే మా కాలేజీల శేరుర్రంటె మా కాలేజీల శేరుర్రని ప్రవేటు కాలేజీలు జేస్తుంటయి ఈ రేంజిల ప్రచారం. కని, ఫర్ ఏ ఛేంజ్ మంత్రి పొన్నం సారే స్వయంగ రంగంలకు దిగిండు హుస్నాబాద్ శాతావాహన యూనివర్సిటీ కోసం గిట్ల. తెలంగాణలో ఎంసెట్ రాసి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిండు.. హుస్నాబద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. మా కాలేజీ కోడ్ SUCE, మా ప్రభుత్వ కాలేజీల అడ్మిషను తీస్కోన్రని ప్రెస్మీట్లనే చెప్పుకచ్చిండు సారు. ఇగ ఈ యూనివర్సిటీల ఏమేం కోర్సులున్నయి, కోర్సుకెన్ని సీట్లున్నయనంటే, బీటెక్కుల మొత్తం ఐదు కోర్సులుంటె, ఒక్కొక్క కోర్సుల 60 సీట్లు ఉన్నాయట. అంతేగాదు, కాలేజీల మంచి హాస్టల్ సుతం ఉన్నదుల్లో. అందుకే మంచి శాన్సును విద్యార్థులు యూజ్ జేస్కోవాలే అన్నట్టే పెస్మీట్ల శెప్పుకచ్చిండు మంత్రి పోన్నం సారు. మొత్తానికి సర్కారు సద్వులంటే సర్కారొల్లే సక్కగ పట్టిచ్చుకోరని అంటుంటరు.. అసోంటియాళ్ల ఇసోంటి కార్యం ముంగటేస్కున్న సర్కారొల్లను మెచ్చుకోవాల్సిందే పోన్రి. మరిగ మంత్రి సారు జేశిన ఈ ప్రచారంతోటి హుస్నాబాద్ శాతావాహన యూనివర్సిటీల సీట్లు నిండేతట్టు అడ్మిషన్లు జర్గుతయో సూడాలె.




