News Analysis: పార్లమెంట్ సెషన్స్: కేంద్రంపై కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్!
News Analysis: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో హచ్‌ఎంటీవీ (hmtv) డిబేట్‌లో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
News Analysis: పార్లమెంట్ సెషన్స్: కేంద్రంపై కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్!
News Analysis: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ.. దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, ప్రతిపక్షాలు సైతం ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జరిగిన hmtv డిబేట్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ లైవ్‌స్టాక్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా దేశ ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ కేటాయింపులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని చరణ్ కౌశిక్ యాదవ్ పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో మహిళా బిల్లు, జమిలి ఎన్నికలు (One Nation One Election), డీలిమిటేషన్ వంటి అంశాలను తెరపైకి తెచ్చి అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు లీకులు ఇస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ దానికి ఇతర వివాదాస్పద బిల్లులను ముడిపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.




