News Analysis: మూసీలో పేదలను వేసి తొక్కేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఫైర్!

News Analysis: మూసీ నది ప్రక్షాళన వివాదంపై టీవీ డిబేట్‌లో బీజేపీ నేత వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2026 10:55 AM IST
News Analysis
X

News Analysis: మూసీలో పేదలను వేసి తొక్కేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఫైర్!

News Analysis: తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ విమర్శల వేడి మరింత రాజుకుంది. "మూసీ ప్రక్షాళనపై వెనకడుగు వేసేది లేదు.. కాలుష్య కాసారం నుండి నల్లగొండ బిడ్డలను రక్షించి తీరుతాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ, 2034 వరకు తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు కేవలం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి అనుకూలమైన కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. hmtv నిర్వహించిన ప్రత్యేక న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో బీజేపీ సీనియర్ నేత వెంకట్ రెడ్డి పాల్గొని, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బీజేపీ నేత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేదా డీపీఆర్ (DPR) లేకుండా, కేవలం తన మనసులోకి వచ్చిన ఆలోచనతోనే మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులకు, ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తులైన అంతర్జాతీయ కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారనే బలమైన ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story