News Analysis: మూసీ ముసుగులో కమీషన్ల కక్కుర్తి?.. కాంగ్రెస్ సర్కార్‌పై BRS సుమిత్రా ఆనంద్ ఫైర్!

News Analysis: మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్ట్, 22A భూముల వివాదంపై hmtv న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో బిఆర్‌ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 11:24 AM IST
News Analysis
X

News Analysis: మూసీ ముసుగులో కమీషన్ల కక్కుర్తి?.. కాంగ్రెస్ సర్కార్‌పై BRS సుమిత్రా ఆనంద్ ఫైర్!

News Analysis: తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవం రెండవ దశ పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. దీంతో పాటు 22A (నిషేధిత జాబితా) భూముల తొలగింపు వ్యవహారంలో కుట్ర కోణం ఉందన్న సీఎం వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

ఈ అంశంపై hmtv నిర్వహించిన ప్రత్యేక న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ పాల్గొని కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

"కడప దాట చేతకానోడు కొండలెక్క బయలుదేరినట్లు" రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాక మూసీ ప్రాజెక్ట్‌ను ముందర వేసుకుంటున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story