Off The Record: అవిశ్రాంత పోరాటయోధుడు తరానికొక్కడు "చంద్రబాబు "
Off The Record: ఏడు పదుల వయసులోనూ తగ్గని ఉత్సాహం.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే రాజకీయ చతురత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్, అమరావతి నిర్మాణం మరియు కూటమి ప్రభుత్వం లక్ష్యాలపై ప్రత్యేక కథనం.
Off The Record: అవిశ్రాంత పోరాటయోధుడు తరానికొక్కడు "చంద్రబాబు "
Chandrababu Naidu: ఆరు పదుల వయసు మీద పడగానే చాలా మంది తాము పెద్దవాళ్ళం అయ్యామని, ఇక పరుగులు తీయలేమని నిట్టూర్పులు తీయడం సహజం. కానీ ఏడు పదుల వయసు మీద పడినా, ఇంకా 35 సంవత్సరాల వయసు కుర్రాడిలో వున్న ఉత్సాహం, పట్టుదల ఆయనలో చూస్తున్నాం. అందుకే ఆయన్ను నిత్య కృషివలుడు అంటారు రాజకీయవేత్తలు. కొత్త ఆలోచనకు పునాదులు వేయటంలో ఆయన దిట్ట. అందుకే ఆయన ఓ స్వాప్నికుడు అయ్యారు. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. ఈ టీడీపీ అధినేత జీవితం ఓ స్ఫూర్తిదాయకం అనే వారు ఎందరో వున్నారు. ఓ పని చేయాలని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్ర పోని నైజం ఒక్క చంద్రబాబులోనే చూస్తున్నామని మేధావులు అంటున్నారు. సంక్షోభంలోనూ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే రాజకీయవేత్త ఎవరైనా వున్నారా అంటే అది చంద్రబాబు ఒక్కరే అని సమాధానం రాక మానదు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఓ మహాయజ్ఞం మొదలు పెట్టారు... దాన్ని పూర్తి చేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా తట్టుకుని అడుగులు వేస్తున్నారు. అనుకున్న లక్ష్యం సాధించే వరకు నిద్ర పోని చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఓ స్థాయికి తీసుకొని వెళ్లేందుకు నిత్యం శ్రమిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. రాజధాని లేని ఏపీకి అమరావతిని రాజధానిగా చేయాలనే ఆలోచనతో అడుగులు వేశారు. అయితే ఆయన ప్రయత్నం పూర్తి కాకుండానే అధికారం కోల్పోయి విపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది... ఈ సమయంలో ఏపీలో అధికారంలో వున్న వైసీపీ.. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ప్రయత్నం చేసింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది... కేసులు పెట్టింది... నంద్యాల పర్యటనలో వున్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభను గట్టిగా దెబ్బ తీసే ప్రయత్నం చేశారు జగన్. ఇక్కడే అసలు చంద్రబాబుకున్న ఖ్యాతి, ఆయనపై జనాలకు వున్న విశ్వాసం బయట పడింది. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విపత్కర పరిస్థితుల్లో.. టీడీపీకి అండగా నిలిచి సంచలనం సృష్టించారు. టీడీపీ, జనసేన ఏకతాటిపైకి రావటం, టీడీపీ, బీజేపీ మధ్య పవన్ వారధిల పని చేసి తెగిన బంధం మళ్ళీ కలపడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అంతే చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో తిరిగి వైసీపీకి గుణపాఠం నేర్పే స్థాయికి ఎదిగిపోయారు. 2024లో కూటమి విజయం సాధించి ఏపీలో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికింది. ఇక అప్పట్నుంచి ఏపీ ప్రగతి కోసం చంద్రబాబు నడుం బిగించి పని చేయటం మొదలు పెట్టారు. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను బాగుచేయటం, అధికారుల్లో జవాబుదారితనం తీసుకొని రావటం మొదలు పెట్టారు...
వైసీపీ హయాంలో ఏపీ రాజధానిపైన సాగిన మూడు ముక్కలాటకు శాశ్వత ముగింపు ఇచ్చేందుకు చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత సాధించిన ఘనత దక్కించుకున్నారు. అమరావతి రాజధాని పనులను పరుగులు పెట్టిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో అహోరాత్రులు చంద్రబాబు శ్రద్ద తీసుకోవటం మరో విశేషం. గోదావరి పుష్కర సమయానికి పోలవరం అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు పనులు జరగటం చంద్రబాబు పని తీరుకు, పట్టుదలకు మచ్చుతునకగా నేతలు చెప్పుకుంటున్నారు... రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్రం నుంచి అవసరమైన సహాయం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు. ఇలా ప్రతీ అంశంపై ఎప్పటికి అప్పుడు అప్ డేట్ గానే ఉండటం ఆయన కమిట్ మెంట్ కు మచ్చుతునకగా ఇప్పుడు జనాలు చెప్పుకుంటున్నారు...
భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి... రైతులు సంతోషంగా వ్యవసాయం చేయాలి... మహిళలు అభ్యున్నతి వైపు అడుగులు వేయాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి... ముఖ్యంగా ప్రజలకు విద్యా, వైద్యం, నివాసం, ఉపాధి ఉండాలి... ఇవే ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత అంశాలు... ఇందుకోసం ఆయన ఏడు పదుల వయసులోనూ ఎలాంటి అలసట చూపించకుండా పని చేస్తున్నారు... ఏపీకి చంద్రబాబు లాంటి సీఎం దొరకడం ఓ అదృష్టంగా రాజకీయ వేత్తలు అంటున్నారు... రాజకీయాల్లో విపక్షాలు విమర్శలు చేయటం, ఆరోపణలతో ఇబ్బంది పెట్టడం సహజమేనని, అయినా ఇలాంటి వాటిని అపార అనుభవం వున్న చంద్రబాబు పెద్దగా పట్టించుకోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... చంద్రబాబు ఇప్పుడు ఏపీకి ఏం చేస్తున్నారో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మరో 20 సంవత్సరాల తర్వాత అందరికి అర్ధం అవుతుందని వారు అంటున్నారు... జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబులాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారని, ఆయన చేసే ప్రతీ పని వెనుక భవిష్యత్ తరాలకు ఉపయోగంగా వుండే అంశాలు తప్పకుండ ఉంటాయని వారు చెప్పుకుని వచ్చారు... మరో పదేళ్లు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగిస్తే రాష్ట్రం అగ్ర స్థానంలో ఉండటం తథ్యమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




