Off The Record: ఏపీ లో లోకేష్ మార్క్.. ఫ్యూచర్ సీఎం చిన్న బాబేనా?
Off The Record: ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి నారా లోకేష్? 2029 ఎన్నికల నాటికి లోకేష్‌కు పగ్గాలు అప్పగించే దిశగా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
Off The Record: ఏపీ లో లోకేష్ మార్క్.. ఫ్యూచర్ సీఎం చిన్న బాబేనా?
Off The Record: ఏపీలో పవర్ షేరింగ్ గురించి.. గత కొన్ని రోజులుగా అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. పాలనా పరంగా తనయుడు నారా లోకేష్‌కు,, చంద్రబాబు కీలక పగ్గాలు అప్పగించబోతున్నారని ఎప్పటి నుంచే విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్‌కు, ఇక ఆ ముఖ్యమైన సీటును అప్పగించడమే బ్యాలెన్స్ అని, ఆ దిశగా తెర వెనక మంత్రాంగం కూడా జరుగుతోందన్న ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగానే రాబోవు రోజుల్లో కాబోయే సియం నారా లోకేష్ అని క్లారిటీ ఇచ్చేశారు ఒంగోలు టీడీపీ ఎంఎల్ఎ దామచర్ల జనార్దన్ రావు. 2029లో ఏపీ రాష్ట్రానికి నారా లోకేషే సీఎం ఎందుకు అనే దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
నారా లోకేష్ రాబోవు రోజుల్లో ఏపీకి సీఎం అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు దామచర్ల జనార్దన్. యుగళం పాదయాత్ర ద్వారా లోకేష్ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని బాధితులకు భరోసా ఇచ్చారన్నారు. అంతేకాదు వాటిని పరిష్కరించగలిగే సత్తా ఉన్న నాయకుడు అని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే జనార్దన్. గత కొంత కాలంగా ఏపీలో సీయం మార్పు జరుగుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి సీఎంగా తమ నాయకుడు నారా చంద్రబాబు ఉన్నారని , ఇప్పడు కాక యినా రాబోవు ఎన్నికల అనంతరం మాత్రం లోకేష్ సియం అవుతాని జోస్యం చెప్పారు దామచర్ల జనార్దన్ రావు.
నారా లోకేష్ ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఎంతో సమర్దవంతంగా పని చేస్తున్నారని, విద్యా శాఖలో పెను మార్పులు తీసుకురావడంతో పాటు ఫ్యూచర్ డవలప్మెంట్ కోసం అలోచించే నాయకుడు లోకేష్ అని దామచర్ల జనార్దన్ చెప్పారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కోసం లోకేష్ పని చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. అలాగే ప్రతిపక్ష పార్టీ వైసిపినీ ఎదుర్కోవడంలో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ, వైసిపికి కౌంటర్ ఇవ్వడంలో కానీ లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఇప్పటికే క్యాడర్ సంతృప్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీని గతం కంటే భిన్నంగా, యువతను, సీనియర్లను కలుపుకొని పోతూ రాజకీయాలను నడిపించడంలో లోకేష్ తనదైన ముద్ర వేసుకుంటున్నారనే టాక్ ఉంది.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్.. అప్పట్లో పెను సంచనలంగా మారింది. నాటి వైసీపీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగానే కాదు..
సైకిల్ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన పార్టీ కార్యకర్తలను, లీడర్లను ఇబ్బంది పెట్టే ప్రత్యర్థి నేతలను, అధికారులను అస్సలు వదిలేదని లోకేష్ చెప్పడం, అన్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చాక.. ప్రతిపక్ష నాయకులు వరుసగా జైలు యాత్ర పట్టడంతో ఇచ్చిన మాటకు కట్టుబడే లీడర్‌గా లోకేష్‌ను నిలబెట్టింది. పార్టీ పార్టీ కేడర్‌కు అండగా ఉండే నేతగా.. లోకేస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒక్క దామచర్ల జనార్దన్ రావు నోటనే కాదు.. మిగతా సైకిల్ లీడర్ల కూడా ఇదే అంశాన్ని ప్రస్తావనకు తెవడం, బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. “కాబోయే సీఎం లోకేష్” అనే మాటలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. సైకిల్ పార్టీలోని నేతలు.. వరుసగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, మంత్రి టీజీ భరత్ కూడా “భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేశే” అని బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్రతో అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని.. మళ్లీ లోకేష్ నిలబెట్టారని SVSN వర్మ కొనియాడారు. టీడీపీ అధికారంలోకి రావడానికి లోకేష్ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని ప్రశంసలు గుప్పించారు.
సమర్థ లీడర్‌గా అన్ని విషయాల్లో ఇప్పటికే లోకేష్ తానేంటి నిరూపించుకోవడంతోనే.. “చంద్రబాబు తర్వాత తదుపరి నాయకుడు”గా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ లోపల చాలా మంది నేతలు–కార్యకర్తలు “లోకేష్ ఒకరే తదుపరి సీఎం అర్హుడు” అనే అభిప్రాయంతో ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఐతే ఈ నిర్ణయం మాత్రం చంద్రబాబు చేతిలోనే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరడంతో.. ఇది కొంత సవాల్‌గా మారింది. లోకేష్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం పట్ల జనసేన, బీజేపీ వైఖరీ ఎలాంటి ఉంటుంది. ఆయా పార్టీల మద్దతు లభిస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.




