Off The Record: దామచర్లకు లోకేష్ సపోర్ట్ ఇస్తున్నారా ?
Off The Record: ఒంగోలులో దామచర్ల జనార్దన్‌పై నారా లోకేష్ చేసిన 'డీజే' వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఆసక్తికర కామెంట్స్ వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి?
Off The Record: దామచర్లకు లోకేష్ సపోర్ట్ ఇస్తున్నారా ?
Off The Record: దామచర్ల జనార్దన్. ఒంగోలు ఎమ్మెల్యే. ఒంగోలు ప్రజలు ఆయనను DJ అని పిలుచుకుంటారు. అదే సమయంలో... "ఒంగోలు అభివృద్ధి ప్రదాత" అంటూ దామచర్లకు ఒక గుర్తింపు ఇచ్చారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. దీనికి కారణం లేకపోలేదు..!
2014లో తొలిసారి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్... నగర అభివృద్ధి, సుందరీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో... అప్పట్లోనే దామచర్లకు "ఒంగోలు అభివృద్ధి ప్రదాత" అనే పేరు వచ్చిందన్నది టీడీపీ వర్గాల వాదన. 2024లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత... నగర సుందరీకరణపై మరింత ఫోకస్ పెట్టారు దామచర్ల.
నగరాన్ని రంగులమయం చేస్తూ...పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నారా లోకేష్ ఒంగోలులో పర్యటించారు. అనంతరం... ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
లోకేష్ కార్యకర్తల సమావేశం... ఒంగోలు టీడీపీ క్యాడర్‌లో కొత్త జోష్ నింపింది..! పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు టీడీపీ ఎలా అండగా ఉంటుందో వివరించిన లోకేష్...పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పదవులు, బాధ్యతలు ఇచ్చి ఎలా గౌరవిస్తుందో వివరించారు.
పార్టీ కోసం కష్టపడితే... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఎలా వస్తుందో కూడా క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని... టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు చిన్నచిన్న విషయాలకు మనస్పర్థలు తెచ్చుకోవద్దని సూచించారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో... కూటమి పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగేందుకు కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అయితే... ఈ సమావేశంలో లోకేష్ చేసిన మరో కామెంట్ మాత్రం ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో అసలు హాట్ టాపిక్‌గా మారింది..!
కార్యక్రమం ప్రారంభంలోనే... ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను నారా లోకేష్ ఓ రేంజ్‌లో పొగిడారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తి DJ అని...అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ లైన్ ప్రకారం పనిచేసే నాయకుడు దామచర్ల జనార్దన్ అని క్యాడర్‌కు వివరించారు.
ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం దామచర్ల ఎప్పుడూ తనను కలుస్తూ ఉంటారని...ఒంగోలు అభివృద్ధి గురించే తనతో మాట్లాడుతుంటారని కూడా చెప్పారు. 2014కు ముందు ఒంగోలు ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది..? అని ప్రజలు గమనించాలని సూచించిన లోకేష్... ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల పాత్రను ప్రస్తావించారు.
ఇంతవరకు ఒక ఎత్తు..! కానీ... ఆ తర్వాత లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి..! చూడటానికి దామచర్ల చాలా సైలెంట్‌గా కనిపిస్తారు... కానీ DJ జోలికి వస్తే దబిడిదిబిడే..! అంతేకాదు... "DJ జోలికి ఎవరైనా వస్తే... DJనే!" అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో వైరల్ టాపిక్‌గా మారాయి.
ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ మొదలైంది..! లోకేష్ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు..? ఎవరికి ఈ మెసేజ్ ఇచ్చారు..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఒంగోలు నియోజకవర్గంలో దామచర్లకు ప్రత్యక్ష రాజకీయ ప్రత్యర్థులు ఎవరు..? పరోక్ష రాజకీయ ప్రత్యర్థులు ఎవరు..? అనే చర్చ కూడా మొదలైంది.
అయితే... గత దశాబ్దంన్నర కాలంగా ఒంగోలు రాజకీయాల్లో దామచర్ల జనార్దన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో ఉన్న సమయంలోనూ... ప్రస్తుతం జనసేనలో ఉన్న సమయంలోనూ... దామచర్ల, బాలినేని రాజకీయ ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారన్న విషయం ఒంగోలు రాజకీయాలను గమనించే వారికి తెలిసిందే.
ఇటీవల ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా రాజకీయంగా వేడి పెంచింది. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకునే స్థాయికి వ్యవహారం వెళ్లడంతో... ఇరు పార్టీల పెద్దలు జోక్యం చేసుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది.
ప్రస్తుతం ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నప్పటికీ... ఆ మాటల యుద్ధం మాత్రం ఒంగోలు ప్రజల మదిలో ఇంకా తాజాగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దామచర్ల జోలికి వస్తే దబిడిదిబిడే అంటూ నారా లోకేష్ కార్యకర్తల సమక్షంలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి.
అయితే... ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది లోకేష్ స్పష్టంగా చెప్పలేదు. కానీ... రాజకీయ వర్గాల్లో మాత్రం రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఇటీవల దామచర్ల, బాలినేని మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో... బాలినేనికి లోకేష్ ఇన్‌డైరెక్ట్‌గా అలర్ట్ సిగ్నల్ ఇచ్చారా..?
అన్న చర్చ ఒకవైపు... మరోవైపు...దామచర్లపై రాజకీయ విమర్శలు చేసే వారికి టీడీపీ హైకమాండ్ నుంచి ఒక క్లియర్ మెసేజ్ వెళ్లిందా..? అన్న చర్చ మరోవైపు సాగుతోంది. అయితే ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు మాత్రమే... లోకేష్ మాత్రం తన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయో స్పష్టంగా చెప్పలేదు.
రాజకీయ సమావేశాల్లో నాయకులు ఒకరిని ఒకరు పొగుడుకోవడం సహజమే..! కానీ... రాజకీయ నాయకుల మాటల్లో ఒక్కోసారి ఒక్కో పదానికి ఒక్కో అర్థం ఉంటుంది. పొగడ్తలను పెద్దగా పట్టించుకోని రాజకీయ నాయకులు...వార్నింగ్‌లు, సిగ్నల్స్, పొలిటికల్ మెసేజ్‌లకు మాత్రం ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు.
ఇప్పుడు ఒంగోలు పొలిటికల్ సర్కిల్‌లో కూడా ఇదే డిబేట్ నడుస్తోంది. లోకేష్ దామచర్లను పొగిడిన మాటల కంటే..."DJ జోలికి వస్తే దబిడిదిబిడే" అన్న మాటకే ఎందుకింత ప్రాధాన్యం వచ్చింది..? DJకి ఇది కేవలం ప్రశంసా..? లేక ప్రత్యర్థులకు పొలిటికల్ వార్నింగ్‌నా..?
ఒంగోలు రాజకీయాల్లో... DJ ఇప్పుడు కేవలం ఓ పేరు కాదు... ఓ పొలిటికల్ బ్రాండ్‌గా మారిందా..? దామచర్లకు లోకేష్ ఇచ్చిన బూస్ట్... టీడీపీ క్యాడర్‌కు ఇచ్చిన జోష్... అదే సమయంలో... "DJ జోలికి వస్తే దబిడిదిబిడే" అంటూ చేసిన హాట్ కామెంట్... ఇవన్నీ కలిపి చూస్తే...ఒంగోలు ప్రత్యర్థులకు ఒక మెసేజ్ మాత్రం గట్టిగానే వెళ్లిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మరి... లోకేష్ ఇచ్చిన ఈ పొలిటికల్ సిగ్నల్‌కు ఎవరి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? DJ మోగుతుందా..? లేక... ఒంగోలు పాలిటిక్స్‌లో కొత్త సౌండ్ మొదలవుతుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!




