Burning Topic: విక్రమ్ ల్యాండర్ తెచ్చిన కీలక సమాచారం
Burning Topic: చంద్రుడిపై మానవ నివాసం ఇక కల కాదు! 2026 నుంచి 2032 వరకు మూడు దశల్లో భారీ 'మూన్ బేస్' నిర్మించేందుకు నాసా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది.
Burning Topic: విక్రమ్ ల్యాండర్ తెచ్చిన కీలక సమాచారం
Burning Topic: ఆకాశంలో తెల్లగా మెరిసిపోతూ కనిపించే చందమామను ఇష్టపడినది ఎవరు? మానవుడు చంద్రుని మీదకు వెళ్లగలడా? అక్కడ కాపురం పెట్టగలడా? అనే ఆశలు కలగానే మిగిలిపోవడం లేదు. అమెరికాకు చెందిన నాసా, చైనా వారి సీఎన్ఎస్ఏ పరిశోధనా సంస్థలు ఈ దిశగా పోటా పోటీగా చేస్తున్న ప్రయోగాలు మన ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. చంద్రునిపైకి సాధారణ విమాన ప్రయాణంలాగే వెళ్లి రావచ్చని, అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే సమయంలో భారత్ కు చెందిన ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మరింత కీలక సమాచారం ఇవ్వడం అబ్బుర పరుస్తోంది.
ఆకాశంలో కనిపించే చందమామ మీదకు వెళ్లాలనేది మానవుని శతాబ్దాల స్వప్నం.. ఆ ఉపగ్రహం రహస్యాలు ఛేదించడానికి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 1969 జూలై 20 అమెరికా తొలిసారిగా చంద్రుని మీదకు మనిషిని పంపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అపోలో 11 మిషన్ ద్వారా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ ఘనతను సాధించాడు. ఈ ఘటన జరిగిన దశాబ్దాలు జరిగిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రమండల యాత్ర 'ఆర్టెమిస్-2' విజయవంతంగా పూర్తి కావడం, నలుగురు వ్యోగాములు చంద్రున్ని దగ్గర నుంచి చూసి రావడం తెలిసిందే.. తాజాగా చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసం నిర్మించాలని ‘నాసా’ ఒక రోడ్‌మ్యాప్ సిద్ధంచేసింది. కేవలం ఒకటో రెండో పరిశోధనా కేంద్రాలు కాదు.. అన్ని వసతులతో కూడిన ఒక భారీ మూన్ బేస్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
నాసా ప్రణాళిక ప్రకారం 2026 నుండి 2032 వరకు మూడు ప్రధాన దశల్లో ఈ మూన్ బేస్ నిర్మాణం జరగనుంది.. 2029 వరకూ చేపట్టే మొదటివ దశలో చంద్రుడి ఉపరితలానికి సురక్షితమైన, నమ్మదగిన ప్రవేశాన్ని నిర్ధారించుకోవడం, ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం పూర్తి చేస్తారు. ఆ తర్వాత 2029 నుండి 2032 చేపట్టే రెండో దశలో మూన్ బేస్‌ను పూర్తి వసతులతో నిర్మిస్తారు.. ఆ తర్వాత మూడో దశలో భాగంగా 2032 తర్వాత మానవ నివాసాన్ని సుస్థిరం చేయడం మొదలు పెడతారు. ఇటీవల వాషింగ్టన్ డీసీ లోని నాసా ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 'మూన్ బేస్’ ప్రోగ్రామ్ మేనేజర్ కార్లోస్ గార్సియా-గలాన్ ఈ వివరాలను వెల్లడించారు. "చంద్రుడిపై శాశ్వత మానవ ఉనికిని స్థాపించడమే తమ అంతిమ లక్ష్యమని, ఇందుకోసం వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను, విభిన్న రకాల ఆస్తులను సమకూర్చుకోబోతున్నామని ప్రకటించారు.
ఆస్ట్రోల్యాబ్ మొదట్లో ఫ్లెక్స్ అనే రోవర్‌ను తయారు చేసింది. అపోలో లూనార్ రోవింగ్ వెహికల్‌ను స్ఫూర్తిగా తీసుకొని మొదట రోవర్‌ను తయారుచేశారు. అయితే ఇది సరుకు రవాణా, శాస్త్రీయ పరిశోధనలు, సాధారణ పనుల కోసం ఉపయోగపడినా, తమ అవసరాలకు సరిపోదని నాసా అధికారులు చెప్పారు. దీంతో ఫ్లెక్స్ రోవర్‌లో మార్పులు చేసి సీఎల్‌వీ–1గా డిజైన్ చేశారు. సూట్లు ధరించిన ఇద్దరు వ్యోమగాములను, వారి పరికరాలను రవాణా చేయడానికి వీలుగా మార్చారు. చంద్రుడిపై శాశ్వత స్థావరం నిర్మాణానికి, సిబ్బందిని ఒకచోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి సీఎల్‌వీ–1 చక్కగా తోడ్పడుతుందని నాసా అధికారులు తెలిపారు. సీఎల్‌వీ–1 సమతల భాగంపై గంటకు 9 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. నిటారుగా ప్రయాణించడంతో పాటు చంద్రుని ఉపరితలంపై ఇంతకుముందు చేరుకోలేని లోతైన బిలాలను, నీడ ఉన్న ప్రాంతాలను, శాస్త్రీయంగా ఆసక్తికరమైన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.




