News Analysis: 'ఛాయ్ పే చర్చ' సరే.. నీట్ లీకేజీపై చర్చ ఎక్కడ..? బీఆర్ఎస్ నేత నిఖిల్ రావు నిలదీత!
News Analysis: బిఆర్‌ఎస్ నాయకుడు నిఖిల్ రావు మాట్లాడిన విషయాలు. ప్రధాని మోదీ 'ఛాయ్ పే చర్చ' అంటారు కానీ 'నీట్ లీక్‌పై చర్చ' ఎక్కడ అని ప్రశ్నించారు.
News Analysis: 'ఛాయ్ పే చర్చ' సరే.. నీట్ లీకేజీపై చర్చ ఎక్కడ..? బీఆర్ఎస్ నేత నిఖిల్ రావు నిలదీత!
News Analysis: ఢిల్లీలో విద్యార్థులు, యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస బాధ్యత వహించకపోవడంపై hmtv న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు నిఖిల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 13-14 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, అస్సాంలో రూ.100 కే క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడూ 'ఛాయ్ పే చర్చ' అని మాట్లాడతారని, కానీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన 'నీట్ లీక్‌పై చర్చ' ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో విద్యార్థుల తరపున కాంగ్రెస్ పోరాడటం హర్షణీయమే అయినప్పటికీ, తెలంగాణలో ఇచ్చిన 'యూత్ డిక్లరేషన్' హామీలను కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చడంలేదని ప్రశ్నించారు.




