News Analysis: రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే మూసీ ప్రాజెక్ట్‌ను బీజేపీ అడ్డుకుంటోంది: కాంగ్రెస్ నేత మానవత రాయ్

News Analysis: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్టంలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు మానవత రాయ్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 11:31 AM IST
News Analysis
X

News Analysis: రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే మూసీ ప్రాజెక్ట్‌ను బీజేపీ అడ్డుకుంటోంది: కాంగ్రెస్ నేత మానవత రాయ్

News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవనం మరియు అభివృద్ధి పనులపై రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలో hmtv నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవత రాయ్, ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్ట్ ద్వారా మంచి పేరు వస్తుందనే అసూయతోనే బీజేపీ, బిఆర్‌ఎస్ నాయకులు ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ పనుల కోసం రూ. 7,345 కోట్లు కేటాయించామని, ఇందులో భాగంగా 21 కిలోమీటర్ల మేర ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి బాపుఘాట్ వరకు DPR రూపకల్పన పూర్తి చేసి పనులు వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story