News Analysis: ప్రజల సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ సంబరాలేంటి?.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఫైర్

News Analysis: ప్రజల సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం ఏంటని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 7 Sept 2026 10:55 AM IST
News Analysis
X

News Analysis: ప్రజల సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ సంబరాలేంటి?.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఫైర్

News Analysis: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో నిర్వహిస్తున్న సంబరాలపై బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు, ఉద్యోగుల సమస్యలు, 22ఏ భూసమస్యలు మరియు ఎండిపోతున్న పంటలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ చర్చకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story