News Analysis: విద్యా రంగాన్ని గాలికి వదిలేశారు: ఫీజు బకాయిలపై అల్జాపూర్ శ్రీనివాస్ ఆవేదన

News Analysis: తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎంత దుర్భరంగా తయారైంది? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, కాలేజీల సంక్షోభంపై బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్‌తో హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 12:35 PM IST
News Analysis
X

News Analysis: విద్యా రంగాన్ని గాలికి వదిలేశారు: ఫీజు బకాయిలపై అల్జాపూర్ శ్రీనివాస్ ఆవేదన

News Analysis: తెలంగాణలో విద్యా వ్యవస్థ దుర్భర స్థితికి చేరిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కాలేజీల నిర్వహణను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ చర్చా వేదికలో బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక గుదిబండగా మారిందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నామని, కరెంట్ బిల్లులు, అద్దెలు, బ్యాంక్ లోన్లు కట్టలేక కాలేజీల నిర్వహణ భారంగా మారిందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్య, వైద్యం, వ్యవసాయం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యాలని, కానీ ఏ ప్రభుత్వమూ దీనిని సరిగ్గా పట్టించుకోలేదని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉపాధి ఈ వ్యవస్థపై ఆధారపడి ఉందని గుర్తుచేశారు.

ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలన్నీ కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు నిర్వహించాల్సి వచ్చిందని, ఎన్నిసార్లు చర్చలు జరిపినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.