Burning Topic: లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి గట్టి దెబ్బ: రూ. 100 కోట్లు కట్టాల్సిందేనని జడ్జి సంచలన తీర్పు!
Burning Topic: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Burning Topic: లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి గట్టి దెబ్బ: రూ. 100 కోట్లు కట్టాల్సిందేనని జడ్జి సంచలన తీర్పు!
Burning Topic: భారతీయ బ్యాంకులను వేల కోట్ల మేర ముంచేసి దేశం విడిచిపాయిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2 బిలియన్ డాలర్ల కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, దుబాయ్‌లో ఉన్న తన సొంత కంపెనీ 'ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్ఈ' తీసుకున్న రుణానికి తాను ఇచ్చిన వ్యక్తిగత హామీ చెల్లుబాటును లండన్ హైకోర్టులో సవాల్ చేశారు నీరవ్ మోదీ. దీనిపై విచారణ జరిపిన జడ్జి జస్టిస్ సైమన్ టింక్లర్ కీలక తీర్పు వెల్లడించారు. యూకే జైలు వ్యవస్థలో పత్రాల బదిలీలో జాప్యం వంటి కారణాలతో సంక్లిష్టంగా మారిన సుదీర్ఘ న్యాయ ప్రక్రియ అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తీసుకున్న అప్పుకు బకాయిగా 11.5 మిలియన్ డాలర్లు తక్షణమే సదరు బ్యాంకుకు తిరిగి చెల్లించాలని నీరవ్ మోడీని ఆదేశించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు వందకోట్లుగా ఉంటుంది.
2012 జులైలో నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ గ్రూప్‌లోని దుబాయ్ ఆధారిత సబ్ కంపెనీ అయిన 'ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్ఈ'కు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో రుణం ఇచ్చింది. ఈ రుణానికి 2012 ఆగస్టు 3న నీరవ్ మోదీ వ్యక్తిగత హామీ పత్రంపై సంతకం పెట్టారు. కంపెనీ ఒకవేళ రుణం కట్టలేకపోతే తానే స్వయంగా బాధ్యత వహిస్తానని అందులో తెలిపారు. కాగా 2018 ప్రారంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారని నీరవ్ మోదీపై అభియోగాలు వచ్చాయి. దీంతో ఫైర్‌స్టార్ గ్రూప్ ఆర్థిక పరిస్థితి క్షీణించి తిరిగి చెల్లించడంతో విఫలమైంది. దీంతో పూచీ ఇచ్చిన నీరవ్ మోదీపై స్వతంత్ర రుణ వసూలు చర్యలను చేపట్టింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. బకాయిలను చెల్లించాలని కోరుతూ నోటీసులను జారీ చేసినా, పదేపదే డిమాండ్ చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంతలో ఈ నోటీసులను నీరవ్ మోదీ లండన్ హైకోర్టులో సవాల్ చేశారు. హామీని అమలు చేయడం సాధ్యం కాదని, బ్యాంకు సరైన పద్ధతిలో డిమాండ్ చేయలేదని ఆయన వాదన
2018 ఏప్రిల్- 2025 అక్టోబర్ వరకు తాను భారత్‌లో లేనందున బ్యాంకు జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని మోదీ నీరవ్ మోదీ వాదించారు. అయితే లండన్ హైకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. నీరవ్ మోదీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు సక్రమంగా అందాయని పేర్కొంది. నీరవ్ మోదీ ప్రస్తుతం ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ జైలుకు 2025 అక్టోబర్ నాటి డిమాండ్ నోటీసు పంపారని వెల్లడించింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, నీరవ్ గతంలో రాసిన ఒక ఈమెయిల్ ఆధారంగానే పక్కా ఆధారాలతో చిక్కుకున్నారు. ఈ కేసు విచారణ సమయంలో కోర్టులో తనకు బ్యాంకు నుండి ఎలాంటి సరైన నోటీసులు లేదా చట్టపరమైన సమాచారం అందలేదని, అందువల్ల తనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వ్యక్తిగత హామీ నిబంధనలను అమలు చేయలేదని నీరవ్ మోడీ గట్టిగా వాదించారు. అయితే నీరవ్ ఫిబ్రవరి 17, 2018న స్వయంగా రాసిన ఈమెయిల్ కీలకంగా మారింది
నీరవ్ మోడీ రాసిన ఈమెయిల్‌లో, పీఎన్‌బీ కుంభకోణం దేశంలో వెలుగులోకి వచ్చిన తర్వాత తన వజ్రాల వ్యాపార సామ్రాజ్యం తీవ్రమైన ఇబ్బందుల్లో పడిందని స్వయంగా అంగీకరించారు. భారత్‌లో మీడియా నుండి వచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా తన కంపెనీలలో దర్యాప్తు సంస్థల సోదాలు జరిగాయని, ఆస్తులను స్వాధీనం చేసుకునే కార్యకలాపాలు సాగాయని పేర్కొన్నారు. దీనివల్ల తన ఆధీనంలోని ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ సంస్థల రోజువారీ వ్యాపార కార్యకలాపాలను దాదాపుగా పూర్తిగా ఆగిపోయాయన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగానే బ్యాంకు నుండి తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి చెల్లించలేకపోయామని నీరవ్ స్పష్టంగా అంగీకరించారు.నీరవ్ మోదీ వ్యక్తిగత హామీ కిందబ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4,105,189.34 డాలర్లు చెల్లించాలి. చెల్లించాల్సిన వడ్డీ 11.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదెలా చెల్లిస్తాడేది ఆసక్తికరంగా మారింది
నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జెల్జియంలోని జైలులో ఉన్న తమ మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు నీరవ్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లండన్ పారిపోయాడు. ఈ 13,000 కోట్లలో దాదాపు సగం సొమ్ము అంటే రూ.6,498.20 కోట్లు నీరవ్ పక్కదారి పట్టించారని సీబీఐ అభియోగాలు మోపింది. నీరవ్ మోదీ ప్రస్తుతం ఆయన లండన్ జైలులో ఉన్నారు. కాగా నీరవ్ మోదీని భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్ అండ్ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం బ్రిటన్ అధికారులకు లేఖ కూడా రాశారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురాగానే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం.
బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీతో పాటు విజయ్ మాల్యను భారత్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ని కోరారు.ఈ ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తొలి నుంచి సానుకూలంగానే. వారిని అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతోంది.
కాగా భారత దర్యాప్తు సంస్థలు విచారణ నిమిత్తం తనను తీసుకెళ్లి వేధిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నీరవ్ మోదీ గతంలో వెస్ట్ మినిస్టర్ కోర్టులో పిటిషన్ వేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని వేడుకున్నాడు. అయితే నీరవ్ మోదీకి ఎలాంటి హాని జరగదని, కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ గురించే అతడిని ప్రశ్నిస్తామని భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ సర్కారుకు హామీ ఇచ్చాయి. నీరవ్ విచారణకు వేదికగా నిలువనున్న ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు బ్యారక్ నంబర్ 12 వీడియోలను కూడా బ్రిటన్ కోర్టులకు భారత దర్యాప్తు సంస్థలు అందించాయి.




