Off The Record: ఆకుల లళితను కాంగ్రెస్ పక్కన పెట్టేస్తోందా ?
Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్‌లో సీనియర్ నేత ఆకుల లలితకు షాక్. ఓటరు జాబితా సవరణ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తొలగింపు, పార్టీలో వీడిన అంతర్గత విభేదాలు.
Off The Record: ఆకుల లళితను కాంగ్రెస్ పక్కన పెట్టేస్తోందా ?
Off The Record: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఓ వెలుగు వెలిగిన ఆకుల లలితకు.. మారిన తాజా రాజకీయ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా మునుపటి స్థాయి ప్రాధాన్యత, కీలక బాధ్యతలు దక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి అధికార బీఆర్ఎస్‌లో చేరడం, ఆ తర్వాత 2023లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడంపై స్థానిక పాత కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది.
ఆమె పునరాగమనాన్ని కొందరు సీనియర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారనేది నిజామాబాద్ రాజకీయాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లోనూ, అలాగే ఇతర అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటున్నారు.
సామాజిక సమీకరణాల పరంగా బలమైన నాయకురాలు కావడంతో, అధిష్టానం ఆమెను పూర్తిగా పక్కన పెట్టకపోయినా.. స్థానిక జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె యాక్టివిటీస్‌ను అంతగా ప్రోత్సహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఘర్ వాపసీ అయ్యాక మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారట ఆకుల లలిత. కానీ పార్టీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల కొంత అసంతృప్తితో ఆమె రగిలిపోయారట.
ఐతే ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టింది. ఎస్.ఐ.ఆర్.ను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. నియోజకవర్గాలకు సీనియర్లను కోఆర్డినేటర్లుగా నియామకం చేసింది.
ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆకుల లలితను.. అర్బన్, రూరల్ నియోజకవర్గాల ఎస్.ఐ.ఆర్. కోఆర్డినేటర్‌గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఆకుల లలిత.. ఎస్.ఐ.ఆర్ ను సీరియస్‌గా తీసుకుని రెండు నియోజకవర్గాల్లో విస్తృత్తంగా పర్యటించారట.
ఐతే ఆమె గతంలో రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో రూరల్ఖపై ఎక్కువ ఫోకస్ పెట్టారట. ఆ మాజీ తన నియోజకవర్గం కోఆర్డినేటర్ కావడం.. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి నచ్చలేదట.
ఫలితంగా మండల అధ్యక్షులు ఆకుల లలితకు సహాయ నిరాకరణ చేశారని ఆమె పీసీసీకి ఫిర్యాదు చేశారట. అర్బన్, రూరల్ నేతలు తనకు సహకరించడం లేదని పలు సమావేశాల్లోనూ.. బహిరంగంగా చెప్పారట.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో.. ఎస్.ఐ.ఆర్.పై కాంగ్రెస్ నేతల పనితీరు బాగోలేదని పార్టీ నేతలతో జరిగిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారట.
ఈ క్రమంలో అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఆకుల లలితను తప్పించి నల్గొండ కో ఆర్డినేటర్‌గా ఉన్న వరంగల్ జిల్లా నేత జంగా రాఘవరెడ్డికి ఆ బాధ్య.తలు అప్పగించారు
ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న ఆకుల లలితకు ఎస్ఐఆర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని కొందరు నేతలు కావాలని దూరం చేశారన్న ప్రచారం లేకపోలేదు.
దీనికితోడు ఆమె పనితీరు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇలా ఉండగా.. ఆకుల లలిత పార్టీలో యాక్టివ్ అవుతున్న క్రమంలో ఎస్.ఐ.ఆర్. కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఉన్న ఫలంగా తప్పించడం పట్ల హస్తం పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయట.
కోఆర్డినేటర్‌గా రెండు నియోజకవర్గాల్లో పర్యటించి పుల్ టైం పనిచేశారట. కానీ నివేదికలు ఇవ్వడంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే వెనుకబడ్డారట. అందుకు ఆ రెండు నియోజకవర్గాల నేతలు సహకరించలేదని ఆమె వాదనగా ఉంటే.. నివేదికలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారట.
ఈ రెండు అంశాలను పక్కన పెడితే.. రూరల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మింగుడు పడకపోవడం అసలు కారణంగా చెబుతున్నారట రాజకీయ విశ్లేషకులు.
ఈ కారణాలతో ఉన్న ఫలంగా ఆమెను ఎస్.ఐ.ఆర్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించారనే టాక్ నడుస్తోందట. అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా ఉండగా రెండు నియోజకవర్గాలు చుట్టొచ్చి యాక్టివ్‌గా పనిచేసిన లలితను బాధ్యతల నుంచి తప్పించాక.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.
పార్టీ నేతల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఆ నేతల వల్లే నివేదికలు ఇవ్వడంలో జాప్యం జరిగిందని అధిష్టానానికి ఫిర్యాదు సైతం చేశారట ఆకుల లలిత. పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు అవకాశం వచ్చినట్లే వచ్చి దూరం కావడం పట్ల ఆమె సన్నిహితులు తెగ ఫీల్ అవుతున్నారట.




