Off The Record: ముగుస్తున్న పదవీకాలం.. మళ్ళీ వాళ్లనే ఉంచుతారా?
Off The Record: నిజామాబాద్ జిల్లాలో నలుగురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం జూన్ లో ముగియనుంది. ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ రేసులో ఉండగా, కొత్త ఆశావహులు పదవుల కోసం వేచి చూస్తున్నారు.
Off The Record: ముగుస్తున్న పదవీకాలం.. మళ్ళీ వాళ్లనే ఉంచుతారా?
Off The Record: ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా ఒకేసారి నాలుగు కార్పొరేషన్ పదవులు దక్కాయి ఆ జిల్లాకు. రెండేళ్లు పూర్తి కావొస్తుండటంతో జూన్ నెలలో వారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆ పదవుల్లో మళ్లీ వారినే కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అనేది అధికార పార్టీలో జరుగుతున్న చర్చ. ఇంకా పెద్ద పదవులపై కొందరు ఆశలు పెట్టుకుంటే.. ఉన్న పదవి తొలగించకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారట మరి కొందరు. దీంతో ఎవరు ఉంటారు ఎవరు ఊడుతారనే ఉత్కంఠకు తెరలేచింది. ఇంతకు ఏంటా జిల్లా.. ఎవరా నాయకులు..?
Next Story




