Big Debate: ఇంటి నంబరే లేదు.. 69 ఓట్లు ఎలా వచ్చాయి? - బిజెపి నేత ప్రశ్న!

Big Debate: ఇంటి నంబర్ లేకుండానే 69 ఓట్లు ఎలా వచ్చాయి? తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణలో దొర్లిన అక్రమాలపై hmtv బిగ్ డిబేట్‌లో స్పందించిన బిజెపి నేత ప్రకాష్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 11:21 AM IST
Big Debate
X

Big Debate: ఇంటి నంబరే లేదు.. 69 ఓట్లు ఎలా వచ్చాయి? - బిజెపి నేత ప్రశ్న!

Big Debate: hmtv 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి పాల్గొని తెలంగాణలో ఇటీవల పూర్తయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో దొర్లిన తప్పులు, బోగస్ ఓట్లు మరియు ఓటర్ల తొలగింపుపై పలు కీలక అంశాలను వెల్లడించారు

కాలనీల్లో అడ్రస్ లేని, అస్సలు ఉనికిలోనే లేని 'ఇంటి నంబర్' పై ఏకంగా 69 బోగస్ ఓట్లు నమోదయ్యాయని, వీటిని తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఉదాహరణతో సహా బయటపెట్టారు.

తెలంగాణలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రాని ఓట్లు దాదాపు 78 లక్షలు ఉండగా, పేర్లు/వివరాల్లో తేడాలు (Disparities) ఉన్న ఓట్లు మరో 20 నుండి 28 లక్షల వరకు ఉన్నాయని, మొత్తం మీద సుమారు కోటి ఓట్లపై తీవ్ర ప్రభావం పడిందని అంచనా వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story