Jordar Varthalu: రేవంత్ రెడ్డి హామీల కు పిండం పెట్టిన బీఆర్ఎస్ లీడర్
Jordar Varthalu: నాగార్జున సాగర్‌లో బీఆర్ఎస్ నేత నోముల భగత్ సంచలన నిరసన! కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌కు కృష్ణా నది తీరాన పిండ ప్రదానం చేశారు.
Jordar Varthalu: రేవంత్ రెడ్డి హామీల కు పిండం పెట్టిన బీఆర్ఎస్ లీడర్
Jordar Varthalu: అగో.. దీంట్లేమున్నది. భగతన్న... జీవిడ్శిన పెద్దలను యాజ్జేసుకుంట, పూజలు జేపిచ్చి పిండం పెడ్తున్నడని గరానికి రాకుర్రుల్లా. ఈడ అన్న పిండంపెడ్తున్నది ఆల్ల పెద్దలకు కాదుల్లో.. సీఎం రేవంతన్న ఏలువడిలకు రాకముందు చెప్పిన రైతు డిక్లరేషన్కట. ఎన్కమాల ఫ్లెక్సీల సూస్తున్నరు గదా.. రైతు డిక్లరేషన్ నాల్గో వర్ధంతి సందర్భంగ పిండ ప్రధానం అని రాసుకచ్చిర్రు. ఏదో.. నామ్ కే వాస్తన్నట్టు గాకుంట, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ల కృష్ణా నది వొడ్డుకు అయ్యగారిని పిలిపిచ్చి.. రైతు డిక్లరేషన్ నామస్య.. పిండ ప్రధానం సమర్పయామని అని మంత్రాలు సద్విపిచ్చిర్రు. ఆవుపెండతోని అల్కిపిచ్చి, ఇస్తారాకుల పిండాలు పెట్టి, దండాలు పెట్టి, పూలదండలేశి కృష్ణానదిల కల్పిర్రు. ఇగ అటెంక భగతన్న మాట్లాడుకుంట.
రైతులను గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్కు దీంతోనన్న బుద్ది రావాల్నని ఇట్ల పిండం పెట్టిండట. మొత్తానికైతే.. ఇన్నొద్దులు కానొస్తలేడని మస్తు ఫీలైన కారు పార్టీ కార్యకర్తలకు, నోముల భగతన్న హాట్ కోర్ ఫ్యాన్సుకు ఈ కొత్త తీరు నిరసన జర్రంత బూస్టింగ్ ఇచ్చినట్టే అయింది. ఇగ రేపురేపు సీఎం రేవంతన్నను గద్దె దించెదాంక ఇదే రెట్టింపు ఉత్సాహంతోని భగతన్న పన్జేస్తడో ఎట్లనో సూడాలె మరి.




