Jordar News: ఒకే చెట్టుకు 234 రకాల మామిడి పండ్లు

Jordar News: ఒకే చెట్టు.. వందల రకాల మామిడి పండ్లు! లక్నో శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 7:18 AM IST
Jordar News
X

Jordar News: ఒకే చెట్టుకు 234 రకాల మామిడి పండ్లు

Jordar News: వారెవ్వా.. భలే ఇచ్చంత్రంగుంది గద శెట్టు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు... ఒక్క మొల్కకు మస్తు రకాల కాయలు కాశ్నయ్. ఒక్క శెట్టుకు ఒక్క రకం కాయలే కాస్తయ్ కని, 234 రకాల పండ్లను ఒక్క శెట్టుకు పండిచ్చి, దున్యాల మాకు మేమే సాటి.. మాకు రారెవ్వరు పోటీ అన్నట్టే.. అసాధ్యాన్ని సుసాధ్యం జేశి సూపెట్టిర్రు లక్నో కాడుండే ఎవుసం శాఖ సైంటిస్టులు. అక్కడి పండ్ల శాఖ యూనివర్సిటీలున్న ఒక యాభై ఏండ్ల శెట్టుకు ఇన్ని వందల రకాల మొల్కలను అంటుగట్టిర్రట. దాంట్ల ముందుగాల బగ్గమంది పాయిరంగ తినే దశేరీ, బంగిన్ పల్లి, కేసరి, ఆల్ఫాన్సో, తోతాపురి, పుల్లటి మామిడి, రసాలు, సఫేదా, కొబ్బరి మామిడి అసొంటి తీరొక్క తీర్లను అంటుగట్టి విజయవంతంగ కాయలు కాశెతట్టు జేశిర్రు సైంటిస్టులు. ఇగీ ముచ్చట సెంట్రల్ ఎవుసం శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారు శెవ్వుల పడంగనే.. యూనివర్సిటీల పెట్టిన శెట్టుతానికి బైలెల్లిండు. శెట్టు సుట్టు తిరుక్కుంట ఏడేడ ఏఏ పండున్నదో.. జనాల శెవ్వులకెక్కెతట్టు కుద్దుగ జెప్పిండు సారు. ఈ ఉపాయం జేశి, శ్రద్ధగ కాపాడ్తున్నోల్లను మెచ్చుకున్నడు. ఎవుసం దండుగన్నోల్లకు, మైండ్ బ్లాకయ్యెతట్టు ఎవుసం జాతర అనెతట్టు జేశెదాంక నిద్రపోమని జెప్తున్నడు. ఏమాటకామాటనే కని, ఇసొంటి శెట్టు ఊరికొక్కటి ఉన్నా సాలుకదానుల్లా. తీరొక్క మామిడి శెట్లను పెంచవల్శిన అవుసరమే ఉండది కావచ్చు కద. జాగ తక్వున్నోల్లకు సుతం మస్తు ఫాయిదా అయితది గద. ఈ ఒక్క శెట్టు పెట్టుకుంటె, రెండు వందల రకాల శెట్లు ఉన్నట్టే అయితది పోర్రి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story