Burning Topic: నా దేశం వైపు చూస్తే గుడ్లు పీకేస్తా?
Burning Topic: భారత సైనిక పరాక్రమానికి నిదర్శనం 'ఆపరేషన్ సింధూర్'కు ఏడాది పూర్తి! పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన గట్టి సమాధానం ఏంటి?
Burning Topic: నా దేశం వైపు చూస్తే గుడ్లు పీకేస్తా?
Burning Topic: 2025 మే 7 తేదీని దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేదు. సరిహద్దులు దాటి వచ్చిన అమాయక ప్రజలను చంపి, సరిహద్దులకు ఆవల పిరికి పందల్లా తలదాడచుకున్న ఉగ్రవాదులు, వారి శిబిరాలు, పెంచి పోషిస్తు్న్న శత్రు సైన్యానికి గుణపాఠం చెప్పి మళ్లీ కన్నెత్తి చూడలేనంతటి భయాన్ని మిగిచ్చిన రోజు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు, పర్యాటకులు కన్నుమూశారు. హిమాలయాల్లోని పచ్చని నేల రక్తంతో తడవడం చూసి ప్రతి భారతీయుడి గుండె మండిపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులను, వారిని పంపిన పాకిస్థాన్‌ను అంత తేలికగా వదలకూడదని నిర్ణయించింది భారత ప్రభుత్వం. ఫలితంగా మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరిట భారీ ఆపరేషన్ చేపట్టింది. భారత వైమానిక దళం పాకిస్థాన్‌తో పాటు ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోకి దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. పహల్గాంలో చిందిన భారతీయుల ప్రతి రక్తం చుక్కకూ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది పాకిస్థాన్.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం సరిహద్దులకు అవల ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. బహవల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్, సియాల్‌కోట్, ముజఫరాబాద్, కోట్లీ, భింబర్ ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. ఎదురుదాడికి దిగిన పాకిస్థాన సైన్యం వెన్ను విరిచింది భారత సైన్యం. ఆ దేశంలోని వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేసింది. బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్ భూభాగంలోని పలు ప్రాంతాల్లో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. డ్రోన్లు, నెట్‌వర్కింగ్, లక్ష్యాల గుర్తింపులో ఏఐ ఉపయోగంతో యుద్ధతంత్రాన్ని సరికొత్త స్థాయికి భారత్ తీసుకెళ్లింది. అణ్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పాకిస్థాన్ పటిష్టమైన భారత సైనిక శక్తి ముందు తలవంచక తప్పలేదు. దాడులు మొదలైన రెండు రోజులకే అంటే.. మే 9న కాల్పుల విరమణ కోసం అర్థించక తప్పలేదు.
ఆపరేషన్ సిందూర్ భారతదేశం తన శత్రువుల పట్ల అనుసరించే వైఖరిలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా నిలిచింది. అప్పటి వరకు రక్షణ ధోరణిలో ఉన్న భారత్, ఒక్కసారిగా 'ఆక్రమణే ఉత్తమ రక్షణ' అనే సిద్ధాంతాన్ని స్వీకరించింది.మన దేశం దశాబ్దాల కాలంలో చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఆపరేషన్ సింధూర్ ఒకటిగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీయడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తుందని, తనను తాను రక్షించుకోవడానికి ఎంతటి చర్యకైనా వెనుకాడదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది భారత్. సీమాంతర ఉగ్రవాదంపై మన దేశం అనుసరిస్తున్న దూకుడుకు, మారుతున్న మన సరికొత్త వ్యూహాత్మక విధానాలకు ‘ఆపరేషన్ సింధూర్’ ఒక నిలువెత్తు నిదర్శనమని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత ఏడాది కాలంలో దేశ భద్రతను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆత్యాధునిక ఆయుధాల కోసం బడ్జెట్ కేటాయింపులను పెంచింది
భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన సాయుధ దళాల నైపుణ్యాన్ని, సంసిద్ధతను, సమన్వయ శక్తిని ఎత్తిచూపిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి అయిన వేళ ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఉగ్రవాదాన్ని, దానికి సహకరిస్తున్న వ్యవస్థలను సమూలంగా నాశనం చేసేందుకు భారత్ దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు అసమానమైన ధైర్యాన్ని సంకల్పాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. మన సైనికుల శౌర్య పరాక్రమాలకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందని మోదీ పేర్కొన్నారు. దేశ భద్రతకు, పౌరుల ప్రాణాలకు హాణి తలపడితే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ ఎక్స్ అకౌంట్స్ డీపీలకు ఆపరేషన్ సిందూర్ చిత్రాన్ని జోడించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సరిహద్దు ఘర్షణగా మిగిలిపోలేదు. అది భారత సైనిక సిద్ధాంతాన్ని పునర్లిఖించింది. నేడు భారతదేశం గత యుద్ధాల పాఠాలను చదవడం లేదు, భవిష్యత్తు యుద్ధాలను ఎలా గెలవాలో ప్రపంచానికి నేర్పిస్తోంది. వేగం, కచ్చితత్వం, స్వదేశీ సాంకేతికతే ప్రాతిపదికగా సాగుతున్న ఈ ప్రయాణంలో 'ఆపరేషన్ సింధూర్' ఒక నిరంతర ప్రేరణగా నిలిచింది. ఆపరేషన్‌ను జాతీయ సంకల్పానికి, సంసిద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా అభివర్ణించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత సాయుధ దళాల శౌర్యానికి, త్యాగాలకు ఆయన నివాళులర్పించారు. (Rajnath Tweet on Operation Sindoor)
ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైన నేపథ్యంలో భారత వైమానిక దళం ఓ వీడియో రిలీజ్ చేసింది. "భారత్ ఏదీ మరిచిపోదు. దేనినీ క్షమించదు' అంటూ ఐఏఎఫ్ ఈ వీడియోలో తెలిపింది. 'భారత్ ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది' అని ప్రధాని మోదీ హెచ్చరికలు ఇందులో ఉన్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అందుకు ప్రతీకారంగా భారత సైన్యం ప్రణాళికలు, దళాల సమీకరణ, ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపింది. గతంలో జరిగిన సంఘర్షణలలో భారత్ సంయమనం పాటించాలని కోరిన దేశాలు ఈసారి అందుకు భిన్నంగా పౌరులను, భూభాగాన్ని రక్షించుకునే మన హక్కుకు మద్దతు తెలిపాయి.కశ్మీర్ చుట్టూ ఉన్న కథనాన్ని మార్చడంలో కూడా ఆపరేషన్ సిందూర్ సహాయపడింది. ఈ దాడులను ద్వైపాక్షిక వివాదం కోణంలో కాకుండా, ఉగ్రవాదానికి చట్టబద్ధమైన ప్రతిస్పందనలో భాగంగా చూశారు.
ఆపరేషన్ సిందూర్ పేరు వెనుక ఒక భావోద్వేగ కథ ఉంది. ఉగ్రవాదులు భర్తలను మహిళల ముందే చంపి, వారి జీవితాల్లోని సంతోషాన్ని తుడిచేడంతో ఎన్నో కుటుంబాల్లో కుంకుమ చెరిగిపోయింది. ఆ అమాయక మహిళల కన్నీరు, వారి బాధ, వారి కోపం.. ఇవన్నీ ఈ పేరులో ప్రతిబింబించాయి. ఆపరేషన్ లోగోలో ‘O’ అక్షరం స్థానంలో కుంకుమ భరిణెను ఉంచడం ద్వారా భారత్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. “భారత మహిళల గౌరవాన్ని తాకితే.. దాని ఫలితం ఎంత భయంకరమో ప్రపంచం చూస్తుంది” అని గర్జించింది.
ఈ ఆపరేషన్‌లో భారత మహిళా అధికారుల పాత్ర కూడా ప్రత్యేకంగా నిలిచింది. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వంటి మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చి ఆపరేషన్ వివరాలను వెల్లడించినప్పుడు దేశ ప్రజలు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఇది కేవలం పురుషుల సైన్యం కాదని.. దేశ రక్షణలో భారత మహిళలు కూడా సమానంగా ముందుంటారని వారు నిరూపించారు.




