Jordar Varthalu: మాయమైన శవం మీద బంగారం..లొల్లికి దిగిన బందువులు
Jordar Varthalu: జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. ఆసుపత్రి సిబ్బందే వీటిని చోరీ చేశారని బంధువుల ఆరోపణ.
Jordar Varthalu: మాయమైన శవం మీద బంగారం..లొల్లికి దిగిన బందువులు
Jordar Varthalu: నమ్మి నానవోత్తె పచ్చి బుర్రలైనట్టు జేశిర్రుల్ల జగిత్యాల జిల్లా సర్కారు దావకాణల. పానం మంచిగ లేదని ముసలవ్వను దావకాణకు తీస్కపోతె జీవిడ్శినంక పెయ్యి మీది నగలు మొత్తం మాయం జేశిర్రట ఆస్పత్రిల పన్జేశేటొల్లెవ్వలో. కొడిమ్యాల మండలం నాచుపల్లి ఊరట ముసలవ్వది. బుధారం పానం మంచిగ లేక జిల్లా కేంద్రంలున్న క్రిటికల్ కేర్కు తీస్కపోతె, ట్రీట్మెంటు జర్గుతుండంగనే జీవిడ్శిందట ముసలవ్వ. అటెంక ఏమైందో కాకా జెప్తడు. ఎంత సిగ్గు తప్పినొల్లున్నరు సూడుర్రి. శవం మీద నిజంగనే పేలాలు ఏరుకున్నంత పన్జేశిర్రు గదా. ఇదే ముచ్చటను దావకాండ్ల పన్జేస్తున్న గీ అన్నను అడుగుతె నాకేం తెల్వదన్నట్టు శెప్పుకచ్చిండు.
ముసలమ్మ ఒంటి మీద నగలు మాయం జేశిర్రని ఇంటొల్లు.. నాకే పాపం తెల్వదని దావకాండ్ల పన్జేశే గీ అన్న. కాశేపు ఆస్పత్రి కాడ గడబిడ గట్టిగనే అయ్యింది. పానం మంచిగ లేదని దావకాణకత్తె. జీవిడ్శిన మన్శి మీద నగలు మాయం జేత్తారా అని శిన్నగ దౌడానికి దిగిర్రు ముసలవ్వ ఇంటొల్లు. మరి ఆఖర్కు ఏమైందో గనుల్ల. మొత్తానికి ఇంతకు మంచి దిగజారిపోరు కొందరు జనాలు అనుకున్న ప్రతీసారి.. అంతకు మించి దిగజారి పోతున్నరుల్ల. కలియుగం పాడువడా.. ఇంకెంతకున్నదో.




