Burning Topic: కరువు కోరల్లో అలమటిస్తున్న పాకిస్తాన్

Burning Topic: పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రాజ్యమేలుతున్నాయి. $290 బిలియన్ల అప్పులతో పాక్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు పేదరికంలో మగ్గుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 July 2026 6:28 AM IST
Burning Topic
X

Burning Topic: కరువు కోరల్లో అలమటిస్తున్న పాకిస్తాన్

Burning Topic: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ ప్రజలు "అన్నమో రామచంద్ర" అంటూ అల్లాడిపోతున్నారు. తాజా నివేదికల ప్రకారం.. దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, ఆహార కొరత ఊహించని స్థాయికి చేరుకున్నాయి.

ప్రతి 10 మందిలో ముగ్గురు పేదరికంలో మగ్గుతున్నారు. పాకిస్తాన్‌పై దాదాపు 290 బిలియన్ డాలర్ల అప్పులు ఉండగా.. దేశ ఆదాయంలో సింహభాగం ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, బలూచిస్తాన్, పీఓకేలలో అంతర్గత తిరుగుబాట్లు, నిరసనలు దేశాన్ని మరింత కుంగదీస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story