Burning Topic: బయటపడ్డ పాకిస్తాన్ వంకరబుద్ది.. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ యుద్ధ విమానాలు
Burning Topic: అమెరికా-ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది.
Burning Topic: బయటపడ్డ పాకిస్తాన్ వంకరబుద్ది.. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ యుద్ధ విమానాలు
Burning Topic: అంతర్జాతీయంగా పాకిస్థాన్ కపట బుద్ధి, ద్వంద్వ వైఖరి మరోసారి ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటూ.. మరోవైపు ఇరాన్‌కు సహకరించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అమెరికా మీడియాలో పాకిస్థాన్ తీరును ఎండగడుతూ కథనాలు వచ్చాయి. ఇరాన్‌లో యుద్ధం చేస్తున్న అమెరికా ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ పాటిస్తూ చర్చలకు అవకాశం ఇవ్వడం తెలిసిందే. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ వేదికగా మొదటి విడత చర్చలు జరగడం తెలిసిందే. కాగాఅదే సమయంలో ఇరాన్ కొన్ని యుద్ధ విమానాలకు పాకిస్థాన్‌లోని ఎయిర్ బేస్‌లకు తరలించింది. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ కొన్ని యుద్ధ విమానాలు వచ్చాయి. వీటిలో RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని చెబుతున్నాయి. ఇది గూఢచర్యం, నిఘా సమాచార సేకరణ కోసం ఉపయోగించే ప్రత్యేక సైనిక విమానం.
అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన విమానాలను రక్షించేందుకే పాకిస్థాన్ తన ఎయిర్‌ఫీల్డ్‌లను వినియోగించుకునేందుకు అనుమతిచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్‌కు, చైనాకు దూరం కాకుండా అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు అనుమారిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్‌లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని అంటున్నారు.
ఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాకిస్థాన్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్‌తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది.పాకిస్థాన్ దాదాపు 80 % సైనిక సామగ్రి, యుద్ధ వ్యవస్థలు చైనా నుంచే దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా ఒత్తిడితోనే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం పాకిస్తాన్‌లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్‌లో దిగిందని చెబుతున్నారు. అయితే తాలిబాన్లు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అలా చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ - అమెరికా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రపై అమెరికా ప్రభుత్వ వర్గాలు ఆందోళతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇరాన్ వైఖరి గురించి అమెరికాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, దాన్ని పూర్తి సానుకూల కోణంలో పాకిస్థాన్ ప్రజెంట్ చేస్తోందనే భావనకు కొందరు అధికారులు వచ్చారు. ఇరాన్ వైఖరి గురించి అమెరికాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, దాన్ని పూర్తి సానుకూల కోణంలో పాకిస్థాన్ ప్రజెంట్ చేస్తోందనే భావనకు కొందరు అధికారులు వచ్చారని కథనం పేర్కొంది. పాకిస్థాన్ చర్యల కారణంగా అమెరికా అధికారులు చేస్తున్న ప్రకటనలకు, ఇరాన్ తీసుకుంటున్న వైఖరులకు మధ్య తేడాలు ఉంటున్నాయని అంటున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు చర్చల విషయంలో ఇప్పటిక్ ఇరాన్ పంపిన ప్రతిపాదనలను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో
శాంతి చర్చల స్థితిపై దేశాధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఇరాన్‌కు పాకిస్థాన్ తెలియజేస్తోందా లేదా అనే దానిపైనా ఇప్పుడు అమెరికా ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చర్చల వేళ అణ్వస్త్ర కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ ప్రదర్శించిన మొండి వైఖరిపై ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు..ఈ పరిస్థితుల్లో మళ్లీ ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించే ప్రతిపాదను పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ హర్మూజ్ జలసంధిని ఇరానే నియంత్రిస్తుండటంపైనా ట్రంప్ అసహనంతో ఉన్నారని పేర్కొంది. ఇరాన్‌లోని అతివాద నేతలే శాంతి చర్చలకు అడ్డు తగులుతున్నారనే అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. మెరికా - ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు వెంటిలేటర్‌పై ఉందని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందని, ఆ దేశ ప్రతిపాదన చెత్త ముక్కతో సమానమని వ్యాఖ్యానించారు.




