Burning Topic: భారత్ పై పాకిస్తాన్ మరో భారీ కుట్ర?

Burning Topic: భారత్‌లో ఉగ్ర దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ భారీ కుట్ర! సోషల్ మీడియా వేదికగా యువతను ఎలా ప్రభావితం చేస్తున్నారు?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2026 7:01 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్ పై పాకిస్తాన్ మరో భారీ కుట్ర?

Burning Topic: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు మన పొరుగు శత్రు దేశం పాకిస్థాన్ కొత్త మార్గాలను ప్రయోగిస్తోందా? ఇటీవల ఉత్తర భారత దేశంలో జరిగిన అరెస్టులు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మన దేశంలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు అవసరమైన అన్ని పద్దతులనూ అమలులో పెడుతోంది పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ. తాజగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో అతి పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్ బ్లాస్ట్ అయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితులను అరెస్టు చేయడా వారికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరంతా పాకిస్థాన్ హాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ స్లీపర్‌సెల్స్‌గా పని చేస్తున్నట్లు బయపడింది దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసి రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. యువతను తప్పుదోవ పట్టించి వివిధ రకాల తీవ్రవాద భావజాలాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్యాప్తులో ఐఎస్ఐకు సంబంధించిన ఓ మాడ్యూల్ బయటపడిందని, సోషల్ మీడియా ద్వారా యువతను కలుపుకునే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా అనుమానాస్పదంగా జరిగినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు సులభంగా పర్యవేక్షించగల ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ షెహజాద్ భట్టి ప్రముఖంగా వినిపించింది.

షెహజాద్ భట్టి స్వస్థలం పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం. తనను తాను ఒక వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, మతపరమైన అంశాలపై వ్యాఖ్యాతగా పరిచయం చేసుకుంటున్నప్పటికీ అతనికి పెద్ద నేర చరిత్రే ఉంది. 2013లో అతనిపై దొంగతనం, దోపిడీ, అత్యాచారంతో సహా పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2015లో పాకిస్తాన్ నుండి పారిపోయి దుబాయ్‌కి వెళ్ళాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా మారాడు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు, మతపరమైన అంశాలు, వివాదాలపై వీడియోలను రూపొందించి పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బలహీన యువతను గుర్తించి, ప్రైవేట్ మెసేజింగ్ ద్వారా సంభాషణలు ప్రారంభించి, ఆపై వీడియో కాల్స్ ద్వారా వారిని భట్టికి కలుపుతుందని ఆరోపణలు ఉన్నాయి. తాజా మన దేశంలో అరెస్టయిన వారికి పాకిస్థాన్, ఐఎస్‌ఐ, దావూద్‌తో పాటు షెహజాద్ భట్టీతో సంబంధాలు వెలుగు చూశాయి.

మరోవైపు దేశ రాజధానిలో గత వారం భారీ ఉగ్ర కుట్రను భగ్నమైంది. పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధమున్న 9 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా స్థావరాలు, రక్షణ సిబ్బంది, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు.నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్​సెల్​ పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదుల మాడ్యూల్​ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, తుపాకులు, హ్యాండ్​ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. దేశ రాజధానికి ఉన్న తక్షణ ముప్పును విజయవంతంగా నివారించగలిగింది. కాగా ముంబయి అండర్​వరల్డ్ డాన్​గా పేరొందిన దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ నెట్​వర్క్​లో భాగమైన ముష్కరుల్లో నేపాల్​కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఐఎస్‌ఐ ఈ మాడ్యూల్‌ను అత్యంతక పకడ్భందీగా చాలా కాలంగా పెంచి పోషిస్తోందని గుర్తించారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నెల రోజుల క్రితం పరారీలో ఉన్న అండర్​వరల్డ్ డాన్​ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహ్మద్​సలీం డోలాను తుర్కియే నుంచి భారత్‌కు తీసుకొచ్చింది. ఆయనకు ఢిల్లీ న్యాయస్థానం ఎన్‌డీపీఎస్​ చట్టం కింద, ఇంటర్​పోల్ రెడ్ నోటీసు ఉన్న డోలాను ముంబయికి తరలించేందుకు ఎన్​సీబీకి రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్​ మంజూరు చేసింది. దావూద్ అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని శాసించే కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న డోలాను విచారణ చేస్తే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది., డీ-కంపెనీ పశ్చిమాసియా, ఐరోపా మీదుగా సరిహద్దులు దాటించి నిషేధిత పదార్థాలను ఎలా రవాణా చేస్తుంది? డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులు తిరిగి వ్యవస్థీకృత నేరాల వైపు ఎలా మళ్లిస్తున్నారు? అందుకు వాడే హవాలా మార్గాలు ఏమిటి? అనేది తెలిసే వీలుంది. డోలా ద్వారా పాక్ ఐఎస్​ఐ, దావూద్ ఇబ్రహీం ముఠాల కోసం పనిచేసే యాక్టివ్ స్లీపర్ సెల్స్, డిస్ట్రిబ్యూటర్ల వివరాలు కూడా తెలిసే అవకాశముంది.

దావూద్ ఇబ్రహీం మన దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పన్నిన 1993 నాటి ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి ఆయన. పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే దేశం వదిలి పారిపోయాడు దావూద్. భారత ప్రభుత్వం ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన దావూద్ ఐఎస్‌ఐ రక్షణలో పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. అతన్ని అప్పగించాలని భారత్ డిమాండ్ చేయగా తమ దేశంలో లేడని పాక్ ప్రభుత్వం భుకాయిస్తోంది. ప్రస్తుతం దావూద్ అనారోగ్యంతో ఉన్నాడని సమాచారం. దురందర్ చిత్రంలో దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించడం విశేషం. ఈ చిత్రం దావూద్ చెందిన ‘డి-కంపెనీ’లో తీవ్ర కలకలం రేపినట్లు తెలుస్తోంది. తాము బలహీనపడ్డట్లు అందరూ భావిస్తున్న తరుణంతో మరోసారి భారత్‌లో ఉగ్రకుట్రకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story