Off The Record: ట్విస్టులేం లేవు.. క్లారిటీ ఇచ్చిన మల్లన్న
Off The Record: మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? సీఎం సభలో ప్రత్యక్షమై హస్తం పార్టీతో చేయి కలుపుతారనే ప్రచారంపై కారు పార్టీలో చర్చ.
Off The Record: ట్విస్టులేం లేవు.. క్లారిటీ ఇచ్చిన మల్లన్న
Off The Record: పాలు అమ్మిన, పూలు అమ్మిన అనే డైలాగ్‌తో నిన్నటి దాక సోషల్ మీడియాను షేక్ చేస్తుండే మాజీ మంత్రి మల్లారెడ్డి. కానీ ఇప్పుడు.. మల్లన్న ఏ పార్టీలో ఉన్నారు..? బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి హస్తంతో చేయి కలుపుతారా..? లేక కారుతోనే ప్రయాణం చేస్తారా..? అన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి.
మొన్నటి దాక బీఆర్ఎస్‌లో హల్‌చల్ చేసిన మల్లారెడ్డి.. ఎందుకని ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సొంత పార్టీ మీటింగ్‌కు వెళ్లకుండా.. సడెన్‌గా సీఎం సభలో ప్రత్యక్షం అవ్వడం ఏంటి..? అధినేత కేసీఆర్‌పై సీఎం విమర్శలు చేస్తుంటే అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి..?
ఇదే ఇప్పుడు కారు పార్టీలో రగులుతున్న అగ్గి.. ఇంతకు మల్లన్న మదిలో ఏముంది. జెండా మార్చి.. గేమ్ ఛేంజ్ చేయబోతున్నారా..? ఒకవేళ పార్టీ షిఫ్టింగ్ ఉంటే ముహుర్తం ఎప్పుడు..? బయట జరుగుతున్న ప్రచారంపై మల్లన్న రియాక్షన్ ఎంటి..? వాచ్ దిస్ స్టోరీ.




