Jordar Varthalu: లంచం అడిగినందుకు టికెట్ ఇన్స్పెక్టర్ ను పొట్టు, పొట్టు కొట్టిన జనం

Jordar Varthalu: సంగారెడ్డి జిల్లాలో ఒక టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై ప్రయాణికులు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 May 2026 8:16 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: లంచం అడిగినందుకు టికెట్ ఇన్స్పెక్టర్ ను పొట్టు, పొట్టు కొట్టిన జనం

Jordar Varthalu: ఓ.. మెల్లగనే అన్నలూ.. శాంతి.. శాంతి.. పెద్ద మన్షికి తాకరాని సోట తాకుతె, ఆయింత పెద్ద పర్శానే అయితది మరి. అస్సలే ఎండాకాలం దెబ్బలకు ఏమన్న కాజిక్క. మరి ఈడ శెప్పుదెబ్బలు తింటున్న గీ అన్నకు గంత గోసెందుకచ్చిందంటే.. హైద్రావాద్ కెంచి నారాయణఖేడ్ పోతున్న పల్లెవెలుగు బస్సును సంగారెడ్డి జిల్లా రాయికోడ్ కాడ ఈ తెల్లబట్టలేసుకున్న టికెట్ ఇన్స్ పెక్టర్ ప్రకాష్ సారు టికెట్ల శెకింగుకని బస్సాపిండట. డ్యూటీని స్టిట్టుగనే జేశిండు. దాంట్ల ఒకాయ్న మహిళక్క జీరో టికెట్ మీద ప్రయాణం జేస్తున్నది పశిగట్టిండట. కండక్టర్ను సుతం గిదేందని మందలిచ్చిండట. కండక్టరుకు మెమో ఇచ్చుడైతది, ప్యాసింజర్కు ఫైన్ అన్న, జైలు శిక్షనన్న వడ్తదని జెప్పిండట. మరి ఇవ్వన్ని గాకుంట ఉండాల్నంటె.. ఇరవైవేలు తడ్పాల్ననని జెప్పిండట. ఇగాడ బ్యారం కుద్రలేదు. ఐదువందల్తోని పొయ్యే ఫైన్కు ఇరవైవేలందని బస్సులున్నోల్లంత బస్సు దిగి సారు కారు తానికివోయి బైటికి గుంజిర్రు. శెప్పులకు పన్జెప్పిర్రు. మరి కండక్టర్ వసంతన్నకు సుతం ప్రకాశ్ సారు మీద మంటనే ఉన్నట్టుంది. ఆయ్నో నాలుగు గట్టిగనే సప్పరిచ్చిండు. పెద్దమన్షిని గట్ల కొడ్తె కాదని కడ్మోల్లు ఆపి పంచాది తక్వ జేశి ఎటోల్లనటు ఎల్లగొట్టిర్రు.

ఇగ అటెంక ప్రకాశ్ సారు ఠానాకు పొయ్యి కండక్టర్ వసంత్, ప్రయాణికులను ఉసిగొల్పి ఉత్తి పున్యానికే నన్ను కొట్టిపిచ్చి, పొట్టు పొట్టు దంచిండు. ఆధారాలేం లేకుంట శింపి పారేశిర్రు. వసంత్ మున్పు గూడ గిసొంటి కథలు బగ్గవడ్డడు గావట్టి., శెర్యలు తీస్కోవాల్నని కేసువెట్టిండట. కనీ., నిప్పు లేనిదే పొగత్తదానే ప్రకాశన్న. తెల్లకార్లచ్చిన పెద్దాఫీసరువు, ఏంలేనిది గంతమంది ఉత్తగనే శెయ్యి లేపుతరానే. అట్లంటె.. రాష్టమంత శెకింగ్ ఆఫీసర్లమీద గిట్లనే జేస్తున్నరా చెప్పు. టికెట్ తీస్కోకుంట ఆసరైతరని కండక్టర్లకే వంత వాడ్తరు గాదే పెద్దన్న. మరి సారు జెప్పిన దాంట్ల ఎంత నిజమున్నదో నిలకడ మీద తెల్తది కని, ఏసీబోల్లు రాకున్న ఇన్ స్టంట్ న్యాయం దక్కిందనుకుంట కామెంట్లు జేస్తున్నరు ఈ వార్త ఎర్కైన జనాలు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story