Jordar Varthalu: ఎర్రటెండల బస్సుల కోసం వీళ్ల అవస్థలు చూడండి!
Jordar Varthalu: అదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు వద్ద బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Jordar Varthalu: ఎర్రటెండల బస్సుల కోసం వీళ్ల అవస్థలు చూడండి!
Jordar Varthalu: కొన్ని ఏరియాల నుంచి దినాం వందలు, వేలకానంగ మంది ఆర్టీసీ బస్సుల్ల ఎక్కి పోతుంటరు పబ్లిక్కు. ఇగ అందుకు తగ్గట్టు సౌలతులు ఉంటయా అనంటె, బస్సు కోసం ఎదురు సూశేటి ప్రయాణికులకు నిలువ నీడ సుతం ఉండది కొన్ని దిక్కుల్ల. కూసునేతందుకు కుర్శీలైతే అసల్కే ఉండయి. షాపుల ముంగట్నో.. ఇండ్ల ముంగట్నో కూసోని కూసోని బస్సెక్కి పోతుంటరు పాపం. శిన్నగుండది గోస. కడ్మ రోజులల్లంటె ఏమో అన్కోవచ్చు కని బస్సు షెల్టర్లు లేని జాగల్ల ఈ ఎండలు శెయ్యంగ అరిగోసే ఉంటది. ఆదిలాబాదు జిల్లా గుడిహత్నూరు కాడ గుడ బస్ షెల్టరు లేక సేమ్ తిప్పలు పబ్లిక్కుయి. నిర్మల్, హైదరాబాదు మొకాన పొయ్యే ప్రయాణికులు ఎర్రటెండల నిల్సునుడైతాంది దినాం. ఇటంకెల నేషనల్ హైవే అథారిటొల్లు కొత్త రోడ్డు ఏస్తున్నరుగదా.. అందుకని పాత బస్సు షెల్టర్‌ను కూలగొట్టిర్రట మొన్నట్ల. అట్లిప్పుడు నిలువ నీడ లేకుంటయ్యి గంటల కమానంగ ఎర్రటెండల నిల్సునుడైతాంది ప్రయాణికులు. నెరీ ముసలొల్లు, ఆడొల్లు, శిన్న పిల్లలు ఈ ఎండలకు అల్లాడిపోతార్రటుల్ల పాపం. ఓ అక్కా కడ్మ ముచ్చట నువ్వందుకో ఇగ.
వానకాలంల గుడ మస్తు తిప్పలుండెనట. అప్పుడు వానకు నానిర్రు.. ఇప్పుడు ఎండకు ఎండుతార్రు. శాశ్వత బస్సు షెల్టరు కట్టాలన్నా ఇంక రోడ్డు పనులు పురాగ ఒడ్వలేదు. అందుకే ఇప్పటిమందం తాత్కాలిక బస్సు షెల్టర్ కట్టి తిప్పలు లేకుంట శెయ్యన్నని సర్కారును కోరుతున్నరు పబ్లిక్కు.మరిగ అధికారులు, లీడర్లు ఏం జేత్తరో సూడాలె.


