Big Debate: ‘పొలిటికల్ పార్టీ కాదు.. పవర్ ఫుల్ ప్రెజర్ గ్రూప్’: సీజేపీ ప్లాన్‌పై పెంటపాటి పుల్లారావు విశ్లేషణ!

Big Debate: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యూహాలు, 'క్యా బోల్తీ పబ్లిక్' ప్రచారం మరియు ప్రెజర్ గ్రూప్‌గా దాని ప్రాధాన్యతపై ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు స్పందించారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2026 11:21 AM IST
Big Debate
X

 Big Debate: ‘పొలిటికల్ పార్టీ కాదు.. పవర్ ఫుల్ ప్రెజర్ గ్రూప్’: సీజేపీ ప్లాన్‌పై పెంటపాటి పుల్లారావు విశ్లేషణ!

Big Debate: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపడుతున్న ఉద్యమాలు, 'క్యా బోల్తీ పబ్లిక్' ప్రచారంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో కీలక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒక స్వతంత్ర 'ప్రెజర్ గ్రూప్'గా పనిచేయడమే ఈ పార్టీకి ఉన్న పెద్ద బలమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలు తెలపడం, హక్కుల కోసం పోరాడటం రాజ్యాంగబద్ధమైన హక్కు అని పెంటపాటి పేర్కొన్నారు. ఎలాంటి సొంత రాజకీయాజెండా లేకుండా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యయం, పరీక్షల లీకేజీలు వంటి సమస్యలపై మాట్లాడినంత కాలం ప్రజల్లో సీజేపీకి మంచి ఆదరణ, గుర్తింపు ఉంటుందని విశ్లేషించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story