Jordar Varthalu: అధికారికి బాదం పప్పులు ఇచ్చిన వ్యక్తి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు
Jordar Varthalu: పని చేయని ప్రభుత్వ అధికారికి వినూత్నంగా బాదం పప్పులు ఇచ్చిన బాధితుడు.
Jordar Varthalu: అధికారికి బాదం పప్పులు ఇచ్చిన వ్యక్తి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు
Jordar Varthalu: ఓశినీ.. గిదేంపని, ఆగమాగం టేబుల్ మీద తినే బాధంపల్కులు పారవోత్తున్నడని గరానికి రాకుర్రుల్లా. సర్కార్ పైకం పందికొక్కుల్లెక్క తిని, ప్రజల పనులను పక్కకుపారేశే, పనిశాతగాని ఆఫీసర్ల కండ్లు తెర్పిచ్చే పన్జేశిండు గీ అన్న. సర్కారోల్లు పన్జెయ్యకుంటే కొత్త తీర్ల నిరసనలు ఎట్ల జెయ్యాల్నో సూపిచ్చే పని ముంగటేసుకున్నడు గీ అన్న. గింతగానం.. బాదంపల్కులు తెచ్చి మేడం ముంగట కుమ్మరిచ్చే అవుసరం ఏమచ్చిందంటే.. చత్తీస్ గడ్ దిక్కు బిలాస్ పూర్ల ఉంటడట ఈయ్న. అటు దిక్కు హౌసింగ్ బోర్డు ఆఫీస్ల పన్జెశెటోల్లు.. ఈ అన్న పన్జెయ్యకుంట శెప్పులర్గెతట్టు తిప్పిచ్చుకుంటున్నరట. పొద్దుగాల పోతె మాపటీలి రమ్మని, మాపు పోతె రేపు రమ్మని అరిగోసపుచ్చుకుంటున్నరట. ఇగ గట్టిగ అడ్గుతె, ఫైల్ ఎక్కన్నో పెట్టి మర్శిపోయ్నా అని గీ మేడం ఉద్దెరముచ్చట్లు జెప్తున్నదట.
గందుకే మేడంకు జ్ఞాపకశక్తి పెర్గెతందుకు ఏం తింటె మంచిదని బగ్గ ఆలోశన జేశి, బాదం పల్కుల పొట్లం పట్కపోయిండు. దినాం ఇవ్వి తింటె.. మీ ఐక్యూ.. ఐన్ స్టీన్ను మించిపోతది, పబ్లిక్ ఎన్ని ఫైల్లిచ్చినా అల్కగ యాదుంటదని మేడంకు తెల్వచ్చెతట్టు జెప్పి, పార్సల్ పొట్లాన్ని ఇప్పి వీడియో తీసుకొని మేడం ముంగట పోశిండు. పారపోస్తుంటే.. శెవ్వుల పేను వారినట్టు సుతం గాలేదు. నన్ను కాదు తియ్యన్నట్టే, రిటన్ల ఈనెనే వీడియో తీస్తున్నది నిమ్మలంగ. ఈ అన్న అసొంటోల్లు, ఆడాడ కొందరు ఉండెపట్టుకె, ఈ ఇంత పనులైతున్నయ్ కని, కుక్కకాటుకు శెప్పుదెబ్బన్నట్టు.. సర్కార్ జీతాలు తిని, పన్జెయ్యనోల్లకు ఇదే కరెస్టు పద్దతని అన్నను మెచ్చుకోవట్టిర్రు ఈ వార్త సూశ్న జనాలు.




