Jordar Varthalu: మోడీ, రాహుల్ మాటామంతీ.. ఖుషీ అవుతున్న నెటిజన్లు
Jordar Varthalu: పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోడీ మరియు రాహుల్ గాంధీ మధ్య అరుదైన సంభాషణ చోటుచేసుకుంది.
Jordar Varthalu: మోడీ, రాహుల్ మాటామంతీ.. ఖుషీ అవుతున్న నెటిజన్లు
Jordar Varthalu: : కార్ల కెంచి దిగుడుతోనే మొదుగాలు అక్కడున్నోళ్లందర్కి రొండు శేతులెత్తి నమస్కారాలు వెట్టిండు. అటెంక రాహుల్ గాంధీతోని మాత్రం మంచిగనే పుర్సత్ గ ముచ్చటవెట్టిండు ప్రధాని మోడీ సారు. లోక్ సభలనైనా, బైటనైనా ఎప్పట్కి విమర్షలు ప్రతివిమర్షలన్నట్టే ఉంటది ముచ్చట. కనీ., ఇయ్యాల మహాత్మా జ్యోతిభా పూలే 200వ జయంతి కావట్టి పార్లమెంట్ దగ్గరిపట్లున్న ప్రేరణ స్థల్ కాడ పూలేకు నివాళి అర్పించే కార్యం జేశిర్రు. ఇగీ కార్యంల పాల్గొనేతందుకు మోడీ సారు గుడ అచ్చిండు.
ఇగ అద్వర్కే అక్కడున్న లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కల్శి మోడీ సారు ముచ్చట వెట్టిండు. మరిగ ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు గంత సేపు ఏం మాట్లాడుకున్నరో తెల్వదిగనీ., ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాల మస్తు వైరల్ అయితున్నది. ఇగీ వీడియో సూశినోళ్లు గుడ రాజకీయంల ఎన్ని విమర్షలు జేస్కున్నా గిసొంటి జాగల్ల మాత్రం గవ్వన్నేం మన్సుల వెట్టుకోకుంట అచ్చిన కార్యం మీదనే మాట్లాడుకోవాలే. జాతీయ నాయకులను గౌరవించుకునే కాడ, దేశ ప్రతిష్టను కాపాడే కాడ లీడర్లంత రాజకీయాలకు అతీతంగ మెదులాలే అంటున్నరు.
మరిగ జాతీయస్ఠాయి నాయకులేగాదు., ఇటు రొండు తెలుగు రాష్ట్రాల్లున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు గుడ రాష్ట్ర అభివృద్ది ముచ్చట్ల గిట్లనే కల్సిమెల్సి ఉండాలే అని అంటున్నరు కొందరు మేధావులు. కనీ., మన దగ్గర నాయకులు గట్లెక్కడుంటరు...నోటితోని నవ్వి నోసటితోని ఎక్కిరించినట్టే జేస్తరాయే. ఆ పరిస్థితి ఎప్పుడు మారుతదో., రాజకీయాలంటెనే కంపు అనుకునే కాడి నుంచి రాజకీయాలను గుడ ఒక బాధ్యతగ తీస్కోవాలనుకునే పరిస్థితి ఎప్పుడస్తదో ఏందో పోండ్రి.




