Burning Topic: మరో కొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ
Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. జూన్ 2026 నాటికి 100 విదేశీ పర్యటనలను పూర్తి చేసిన ప్రధాని.
Burning Topic: మరో కొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ
Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. జూన్ 2026 లో ఆయన చేపట్టిన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనతో ఈ మైలురాయిని అందుకున్నారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 ఏళ్ల కాలంలో ఆయన ఈ రికార్డును నమోదు చేశారు. కాగా మోదీ విదేశీ పర్యటనలపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వీటి వెనుక కీలక లక్ష్యాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులుఅంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను పెంచడం ముఖ్య ఉద్దేశ్యం. అలాగే కీలకమైన రక్షణ సాంకేతిక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు మోదీ పర్యటన ఉపయోగపడుతున్నాయంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డ్ సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ ఇటీవలే అదిగమించడం తెలిసిందే.. తాజాగా మరో రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ పదవి చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకూ 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. తాజాగా వారం రోజుల యూరప్ పర్యటనతో ఈ రికార్డును సృష్టించారు. ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలి అధికారిక విదేశీ పర్యటన పొరుగు దేశమైన భూటాన్‌లో సాగింది. 2014 జూన్ 15 నుంచి 16 వరకు ఆయన అక్కడ పర్యటించి దౌత్య సంబంధాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ప్రపంచవ్యాప్తంగా మొత్తం 78 దేశాలను సందర్శించారు.
ప్రధానమంత్రి మోదీ తొలిసారి అధికారం చేపట్టిన 2014 - 2019 మధ్య కాలంలె 49 విదేశీ పర్యటనలు చేశారు. రెండవ విడత (2019 - 2024 మధ్య రెండో విడత ప్రధానిగా ఉన్న సమయంలో 27 విదేశీ పర్యటనలు జరిపారు. మూడవ విడత ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ఈ జూన్ మాసం వరకూ 24 విదేశీ పర్యటనలు పూర్తయ్యాయి. కాగా ప్రధాని హోదాలో మోదీ పర్యటించిన దేశాల్లో ఒకటికన్నా ఎక్కువ సార్లు వెళ్లినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో ఉన్నారు. ఈనెల 18న ఆయన తిరిగి భారత్‌కు చేరుకుంటారు. దీంతో మూడోదఫాలో 24వ పర్యటన పూర్తవుతుంది. ఈ వంద పర్యటనల ద్వారా భారత్ అంతర్జాతీయంగా తన వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, ప్రపంచ వేదికలపై దేశ ప్రతిష్టను పెంచడంలో ఈ పర్యటనలు కీలక పాత్ర పోషించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ద్వారా దేశానికి కలిగిన ప్రయోజానలు చాలానే ఉన్నాయి. ప్రధాని పర్యటనల ద్వారా అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షితులవుతున్నాయి. ఉదాహరణకు ఇటీవల మోదీ జరిపిన UAE, నెదర్లాండ్స్, స్పెయిన్, నార్వే, ఇటలీ) వ్యూహాత్మక పర్యటన ద్వారా దేశానికి సుమారు రూ 3.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు లభించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అంచనా ప్రకారం ఈ పర్యటనల వల్ల దేశానికి 70 బిలియన్ డాలర్లకు పైగా కొత్త వాణిజ్య అవకాశాలు రానున్నాయి.భారతదేశ ముడి చమురు, గ్యాస్ అవసరాల కోసం గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలను మోదీ మరింత బలోపేతం చేశారు.
ఇంధన సంక్షోభ సమయాల్లో కూడా దేశానికి నిరంతరాయంగా చమురు సరఫరా జరిగేలా ఈ పర్యటనలు భరోసానిచ్చాయి.
ప్రధానమంత్రి పర్యటనకు వీసా అవసరమా అనేది మరో ప్రశ్న.. ప్రధానమంత్రికి ప్రత్యేక దౌత్య పాస్‌పోర్ట్ ఉంటుంది. మెరూన్ రంగులోని ఈ పాస్‌పోర్ట్ ఐదు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. సాధారణ పాస్‌పోర్ట్ నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కలిగిన ప్రధానమంత్రికి అనేక దేశాల్లో వీసా అవసరం ఉండదు. అదే విధంగా, వారు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపులు పొందుతారు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది, ప్రత్యేక ప్రోటోకాల్ సౌకర్యాలను కూడా పొందుతారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందు, రెండు దేశాల ప్రభుత్వాలు మధ్యలో అన్ని లాంఛనాలు, అధికారిక అనుమతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయబడతాయి. వీటిలో ప్రధానమంత్రి వీసా ప్రక్రియ, రాయబార సమావేశాలు, సెక్యూరిటీ సమీక్షలు, ప్రోటోకాల్ ఏర్పాట్లు, మీడియా కవరేజ్ లాంటి అంశాలు ఉన్నాయి. ఈ ఏర్పాట్లు పర్యటన సాఫీగా, జాగ్రత్తగా, అత్యధిక సౌకర్యాల కింద జరగడానికి దోహదపడతాయి.




