Off The Record: బీఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ.. తెలంగాణ గడ్డపై మోడీ
Off The Record: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు! మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారిగా తెలంగాణ గడ్డపై మోదీ అడుగుపెట్టనున్నారు.
Off The Record: బీఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ.. తెలంగాణ గడ్డపై మోడీ
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. దేశ ప్రధానిగా మూడో సారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు మోదీ రానుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న మోదీ తెలంగాణ పర్యటనకు ఖరారు అయినట్లు రాష్ట్ర బీజేపీకి చేరిన సమాచారం.. దీంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు..మోదీ టూర్ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి... ఇప్పటికే రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు అందడంతో.... ఇకా మోడీ పర్యటన బహిరంగ సభ జనసమీకరణ,అలాగే ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత సన్నాహక సమావేశం సైతం నిర్వహించినట్టు చర్చ సమాచారం... ఇటీవల దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో తెలంగాణకు వస్తారని ప్రచారం సాగింది..కానీ వాయిదా పడింది.. దీంతో తెలంగాణకు ఎప్పుడెప్పుడు మోదీ వస్తారా? అన్న సందేహాలకు తెరదించుతూ మే 9న రాష్ట్రానికి రానున్నారు మోదీ.. దీంతో మోదీ చేత ఎంఎంటీఎస్ విస్తరణ, బీబీనగర్ ఏయిమ్స్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది... కేవలం అధికారిక కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది....
మోదీ స్పీచ్ పై తీవ్ర ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.... ముఖ్యంగా నారీ శక్తి వందన్ పేరుతో పెట్టిన 33% మహిళా రిజర్వేషన్ల బిల్ తోపాటు ఢిలిమిటేషన్ , రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోవడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.. ముఖ్యంగా ఆగమేఘాల మీద మహిళా రిజర్వేషన్లు ఎందుకని, మహిళ మీద అంతా ప్రేమనే ఉంటే ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో 181 మహిళలకే ఇవ్వొచ్చు అనడం ఆసక్తికరంగా మారింది.. అలాగే 50% సీట్ల పెంపుతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పడమే కాకుండా.... సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా హైబ్రీడ్ మాడల్, ఉత్తర- దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని , జీఎస్డీపీ (ఆర్థిక వృద్ధి రేటు)తో సీట్ల పెంపు చేయాలని కొత్త ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చారు.. ఈ అంశాల కారణంగానే బిల్ వీగిపోయిందని దీంతో జాతీయ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్ సీఎంగా రేవంత్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.. ఈ తరుణంలో మోదీ పర్యటన మరింతా ఉత్కంఠకు దారితీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇకా రేవంత్ లేవనెత్తిన అన్ని అనుమానాలకు ఫుల్ స్టాప్ పేట్టేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో అమిత్ షా క్లారిటీ ఇచ్చినప్పటికీ బిల్ వీగిపోయింది.. అయితే రేవంత్ తెరమీదకు తెచ్చిన హైబ్రీడ్ మాడల్, జీఎస్డీపీ, ఆర్థిక పుష్టి వంటి ప్రతిపాదనలపై మరీ మోదీ ఎలాంటి కౌంటర్ ఎటాక్ చేస్తారనే దానిపై ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది....
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలే కాదండోయ్ .... మోదీ టూర్ ఏకైక లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కార్పోరేషన్లలో ఎన్నికల్లో అధికార , ప్రతిపక్ష పార్టీలను ఢీకొట్టీ ఈసారి మూడు మేయర్ పీఠాలను గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది... జీహెచ్ఎంసీని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో మూడు కార్పోరేషన్లుగా విభజించింది. ఇకా జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 10తో జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు కూడా పూర్తవ్వడంతో మూడు కార్పోరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టే లక్ష్యంతో ఎంఐఎం వ్యూహం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేసిందని, ఒక కార్పోరేషన్ ను ఎంఐఎంకు ధారాదత్తం చేసేందుకు విభజించిందని బీజేపీ రాజకీయ ఎదురుదాడి చేస్తూనే ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టి మూడు కార్పోరేషన్లలో కాషాయ జెండా ఎగరవేయాలని కమల దళం తన రాజకీయ వ్యుహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటనను ఆసరగా చేసుకుని హైదరాబాద్ నగర ప్రాంత ఓటర్లలో మరింత బలాన్ని పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కసరత్తు షురూ చేసిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ప్రధాని పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేకపోలేదు.. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేళ మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా? నేనా ? అన్నట్లు రాజకీయ మాటల తూటాలు ఇప్పటికే పేలుతున్న తరుణంలో ప్రధాని మోదీ టూర్ మరింత రాజకీయ వేడిని రగిలిస్తోంది. తెలంగాణకు మోదీ ఏమీ ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు,మంత్రులు , ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు.. దునీకి కౌంటర్ గా మోదీ చేత పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించి హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అలాగే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మూడు రైల్వే కారిడార్ల కేటాయింపు,అలాగే భవిష్యత్తులో ఇచ్చే నిధులు, చేపట్టే కార్యక్రమాలతో పాటు వరాల జల్లు కురిపించి నగర ప్రజలకు మరింతగా బీజేపీ చేరువ కావాలని, హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే వ్యూహాంతో అడుగులు వేస్తోంది... అందులో భాగంగానే మోదీ టూర్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు తహతహలాడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీ ప్రదర్శన లేకపోయినప్పటికీ కానీ గతం కంటే ఎక్కువ ఓట్ శాతం, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గెలిచామని, అలాగే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు కరపత్రం, ఛార్జ్ షీట్, మరోవైపు అగ్రనేత నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేత ప్రచారం చేయించినప్పటికీ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లలో ప్రతికూల ఫలితాలను చవిచూసింది.దీంతో ఒకవైపు ఓటు షేర్, గతం కంటే మెరుగైన ప్రదర్శన చేశామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నప్పటికీ.. కింది స్థాయిలోని నేతలు, కార్యకర్తలు మాత్రం మున్సిపల్ ఫలితాల షాక్ తో కొంత నైరాశ్యంలో ఉన్నారనే ప్రచారం లేకపోలేదు.. ఇట్లాంటి తరుణంలో మోదీ టూర్ పార్టీకి , కార్యకర్తలు, నేతలకు ఒక బూస్టింగ్ తో జోష్ ఇచ్చేలా నాయకత్వం కసరత్తు చేస్తోంది..
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అదే ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హిందుత్వ ఫైర్ బ్రాండ్ సీఎం యోగి వంటి అగ్రనేతలు ప్రచారం చేయగా.. మరోవైపు పరోక్షంగా నగర ప్రజలను ఆకర్షించే విధంగా హైదరాబాద్ వేదికగా ఓ కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు. దీంతో బీజేపీ అనూహ్యంగా 48 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకొని ఆనాటి అధికార బీఆర్ఎస్ ను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టింది. ఈసారి కూడా అదే జోష్‌తో ముందుకు వెళ్లాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ప్రతికూల ఫలితాల నైరాశ్యంలో ఉన్న నేతలను , కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ పార్టీ బలోపేతమే ఏకైక అజెండాగా మోదీ టూర్ కొనసాగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు మోదీ పర్యటనతో మరింత బలం పెంచుకోవాలని భావిస్తోందటా..ఇక పార్టీలో ఉన్న కొత్త- పాత నేతల మధ్య అంతర్గత పోరు, లేఖలు,లీకులు వ్యవహారం నేపథ్యంలో అందర్నీ సమన్వయ పరుస్తూ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారటా.. మోదీ టూర్ తోనైనా నేతల మధ్య ఐక్యతారాగం తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది..
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మోదీ టూర్ హీట్ పెంచుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. తెలంగాణకు మోదీ ఏమి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో, అలాగే తెలంగాణ విభజన సొంత ఎంపీ వ్యాఖ్యల దుమారంపై ప్రతిపక్షాల ఎదురుదాడికి ఎలాంటి కౌంటర్ ఇస్తారనోనని ఉత్కంఠ నెలకొంది.. ఏదీ ఏమైనప్పటికీ గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి మరి.




