Burning Topic: హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ

Burning Topic: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:24 AM IST
Burning Topic
X

Burning Topic: హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ

Burning Topic: భారతీయ రైల్వేల్లో కొత్త అధ్యాయం మొదలైంది..పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు తొలి అడుగు పడింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో దేశంలో ఈ రైలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హరియాణాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య నడిచే హైడ్రోజన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. భారత రైల్వే రూపురేఖలు మార్చడంతో ఇది కీలకమైన ముందడుగని తెలిపారు ప్రధాని. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయి ప్రకటించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story