Burning Topic: మోదీ నార్వే పర్యటనలో రచ్చ: వెస్ట్రన్ మీడియా కుట్రలను బట్టబయలు చేసిన విదేశాంగ శాఖ!
Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో జర్నలిస్ట్ హెలె లింగ్ ప్రశ్నల వ్యవహారం, నార్వే పత్రిక జాత్యహంకార కార్టూన్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వివాదాల వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే!
Burning Topic: మోదీ నార్వే పర్యటనలో రచ్చ: వెస్ట్రన్ మీడియా కుట్రలను బట్టబయలు చేసిన విదేశాంగ శాఖ!
Burning Topic: ఐదు దేశాల పర్యటనలో భాగంగా నార్వేకు వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే గడ్డపై అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నార్వే రాజధాని ఓస్లోలోని ప్రతిష్టాత్మక సిటీ హాల్‌లో నార్వే ప్రధాని జోనస్ గర్ స్టోర్‌తో కలిసి ప్రధాని మోదీ ఒక భారీ బిజినెస్ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. వివిధ వ్యాపార సంస్థలు, పరిశోధన రంగాలకు చెందిన కీలక ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రధానమంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతర శుద్ధ ఇంధనం, వాతావరణ మార్పులను తట్టుకోవడం, తక్కువ కర్భన ఉద్గారాలు వెదజల్లేలా సముద్రవాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సాంకేతిక, అంతరిక్షం, ఆర్కిటిక్ ఖండంలో పరిశోధన దాకా పలు అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం ఇరు దేశాల ప్రధానమంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా బ్రీఫింగ్ తర్వాత మోదీ వెళ్లిపోతుండగా నార్వేకు చెందిన హెలె లింగ్ అనే మహిళా జర్నలిస్టు ఓ ప్రశ్నవేశారు.. ప్రైమ్ మినిస్టర్ మోదీ.. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం నుండి కొన్ని ప్రశ్నలు ఎందుకు స్వీకరించరు? అంటూ ప్రశ్నించారు. అయితే ప్రధాని మోదీ తన ప్రశ్నను దాట వేశారు అంటూ ఆమె తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ప్రశ్నను స్వీకరించలేదు. ఆయన స్వీకరిస్తారని నేను ఆశించలేదు,” అని వ్యాఖ్యానించారు హెలె లింగ్. సాధారణంగా ప్రధాని మోదీ మీడియాను ఉద్దేశించి నేరుగా మాట్లాడటం అరుదు. 2015లో బ్రిటన్‌లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే నార్వే జర్నలిస్టు హెలె లింగ్ ఉద్దేశ్య పూర్వకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు అనే విమర్శలు మొదలయ్యాయి.
ఈ అంశం కాస్తా ప్రధాని మోదీని వ్యతిరేకంచే పార్టీల నాయకులు, వర్గాలకు అస్త్రంగా మారిపోయింది. దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (Rahul Tweet)
మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ మీడియా సమావేశంలోనూ హెలె లింగ్ ప్రత్యక్షమయ్యారు. భారత్‌లో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని అడిగారు. దీనికి విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ తనదైన శైలిలో సమాధనం ఇచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా.. ఎక్కడో కూర్చుని కొన్ని పక్షపాత ఎన్‌జీఓలు ఇచ్చే తప్పుడు నివేదికల ఆధారంగా ప్రశ్నలు అడగడాన్ని తప్పుపట్టారు. భారత్ గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హెలె లింగ్ ఎక్స్ అకౌంట్ మే 2026 నుండి వెరిఫై చేయబడినట్లు స్పష్టంగా ఉంది. ఆమె ఇటీవలే X ప్రీమియంను కొనుగోలు చేసింది. ( Who is Helle Lyng ) ఏప్రిల్ 2024లో ఆమె చివరి పోస్ట్ పెట్టినప్పుడు కేవలం 800 మందికి పైగా ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆమె ప్రధాని మోదీని నిలదీసినట్లు పోస్టు పెట్టగానే 14,000 మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మోదీ పర్యటనను భారత్ మీద వ్యతిరేక ప్రచారం కోసం హెలె లింగ్‌ను వాడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం మీడియా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారత్ ర్యాంకు 157గా చూపించారు. నార్వేకు చెందిన కెల్లే యోయెన్ అనే జర్నలిస్టు రాసిన వ్యాసంలో ప్రధాని మోదీ హిందుత్వ రాజకీయాలను చేస్తు్న్నారని, ముస్లింలను అణిచివేస్తున్నారని ఆరోపించారు
సరిగ్గా ప్రధాని మోదీ నార్వే పర్యటన సమయంలోనే ఆ దేశానికి చెందిన ఆఫ్టెన్ పోస్టెన్ అనే పత్రిక తన అహంకారాన్ని బయట పెట్టుకుంది. ‘ఒక తెలివైన, విసిగించే వ్యక్తి’ అని అర్థం వచ్చేలా శీర్షిక పెట్టి రాసిన వ్యాసంలో భారత విదేశాంగ విధానంపై కూడా అక్కసు వెళ్లగక్కింది. మోదీని పాములవాడిగా చిత్రీకరించింది. ప్రధాని నార్వే పర్యటనకు ముందే ఈ కార్టూన్ ప్రచురించినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కార్టూన్ పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్నది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు‘యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమ నుంచి బయటపడలేకపోతున్నారు’ విమర్శలు మొదలయ్యాయి. ‘నార్వేలోని అతిపెద్ద పత్రిక.. మోదీపై ఇలాంటి కార్టూన్‌ను ప్రచురించడం సిగ్గుచేటు. ఇది జర్నలిజం కాదు. వలసవాద కాలం నాటి జాత్యహంకారం. భారతదేశ ఎదుగుదలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వారి పూర్వీకుల నాటి మూస ధోరణలను ప్రదర్శిస్తున్నారు’ అని మరొక ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవన్నీ చూస్తుంటే పాశ్యాత్య మీడియా ఉద్దేశ్య పూర్వకంగా ప్రధాని మోదీని, భారత దేశాన్ని టార్గెట్ చేయడం వెనుక దురుద్దేశాలు, కుట్రలు దాగి ఉన్నాయని స్పష్టమవుతోంది. 2014లో భారత ప్రభుత్వానికి చెందిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా అంగారక గ్రహ కక్ష్యను విజయవంతంగా చేరుకుంది. ఇది గతంలో జరిగిన అనేక మిషన్లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో సాధింయిర అద్భుతమైన శాస్త్రీయ సాంకేతిక విజయం. కాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తలపాగా ధరించిన ఒక రైతు ఆవును తోలుకుంటూ ఒక "ఎలైట్ స్పేస్ క్లబ్" తలుపు తడుతున్నట్లు కార్టూన్ వేయడం వివాదాస్పదంగా మారింది. ఇది జాత్యహంకారమే అనే విమర్శలు రావడంతో ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది.
ఇదంతా ఒక ఎత్తేతే ప్రధానమంత్రి మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' బహుకరించి గౌరవించింది.




