Jordar Varthalu: ప్రధాని మోడీ తీసిన ఫోటోలు ఇవే

Jordar Varthalu: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ హుగ్లీ నదిలో బోటు షికారు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 April 2026 9:54 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ప్రధాని మోడీ తీసిన ఫోటోలు ఇవే

Jordar Varthalu: యమహానగరి కలకత్తా పురి.. నమహో హుగిలీ హౌరా వారధి అని పాటొక్కటే తక్వుల్ల బ్యాగ్రౌండ్ల.. కలకత్తా నగరంలున్న హుగ్లీ నదిల బోట్ల కూసోని అట్ల షికారు జేశిండు పీఎం మోదీ సారు. పీఎం అంటెనే మస్తు బిజీ షెడ్యుల్ ఉంటది. అందున మోదీసారు దినాం పదారు, పద్దెన్మిది గంటలు పన్జేత్తడని శెప్తుంటరు. ఎప్పుడో గని తీరక దొర్కది సారుకు. ఎప్పుడన్న తీరిక దొర్కుడు ఆల్శం.. అడ్వికన్న పోతడు లేకుంటె ఇగో ఇట్ల అందుబాట్ల టూరిస్టు జాగ ఏదుంటె ఆడికివొయ్యి మనసు నిమ్మలమయ్యేదాంక తిర్గుతడు.‎ ఇగిప్పుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రంల పర్యటిస్తున్నడు గదా పీఎం సారు. అందుకే కలకత్తా నగరంలున్న హుగ్లీ నదిల బోటు షికారు జేశిండు. హౌరా బ్రిడ్జి కాడ నదిల బోట్ల తిర్గుకుంట నది అందాలను, హౌరా వంతెన అందాలను తన కెమెరాల బంధించిండు సారు.

పీఎం సారట్ల బోట్ల తిర్గుతుంటె సారును సూశేంతందుక కొద్ది జనం రాలేదు. పీఎం సారు నది అందాలను పోట్వ కొడుతుంటె, ఒడ్డుకున్నొల్లంత.. పీఎం సారును పోట్వలు తీస్కుంట సంబురపడ్డరు. ఆఖర్కు ఒడ్డకచ్చినంక మోదీ సారు గుడ పబ్లిక్కుతోటి పోట్వలు దిగిండు. పడ్వలు నడ్పేటొల్లతోటి, శాపలు పట్టేటొల్లతోటి. పొద్దటి నడ్కకు అచ్చినొల్లతోటి ముచ్చట్లు సుతం పెట్టిండు. ఒగ పెద్దాయినెనయితె దగ్గరికి తీస్కోని పాయిరం కొద్ది అల్ముకున్నడు. ఓ బుడ్డోని తల్కాయ మీద శెయ్యేశి దీవెనార్తులు పెట్టిండు. ఇగ ఇదే ముచ్చట మీద హుగ్లీ నదిల బోటు షికారు జేసుడు శానా సంబురమనిపిచ్చిందని ఎక్సు అకౌంట్ల వీడియోలు,పోట్వలు పెట్టి, రాస్కచ్చిండు సారు. పశ్చిమ బెంగాల్ మొదాటి విడ్త ఓట్ల పండుగ మొన్నట్ల ఒడ్శింది గదా. రొండో విడ్త ఓట్ల పండుగ 29 తారీఖు జర్గవోతాంది. అందుకోసమనే ప్రచారం జెయ్య పశ్చిమబెంగాల్ల సుడి వెట్టిండియ్యళ్ల మోదీ సారు. సూడాలె మరి ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంల ఏ పార్టొల్లు జెండా పాతుతరనేది ఇగ.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story