Jordar Varthalu: జోర్దార్ గ డ్యాన్సులు చేసిన పోలీసులు
Jordar Varthalu: నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు ఒక్కరోజు మాత్రం ఆ టెన్షన్ మర్చిపోయి అదిరిపోయే డ్యాన్స్‌లతో సందడి చేశారు.
Jordar Varthalu: జోర్దార్ గ డ్యాన్సులు చేసిన పోలీసులు
Jordar Varthalu: పోలీసుల ముచ్చటని జెప్పిర్రు.. ఫంక్షన్ల డ్యాన్సులు జేస్తున్నోళ్ల వీడియో సూయిస్తున్నరేందని అనుకుంటున్నరా.. ఇగో ఈడ.. ఆయా షేర్ పాటకు జోర్దార్ స్టెప్పులేస్తున్నది ఎవ్వలోగాదుల్లా.. మైబ్బాద్ జిల్లా ఎస్పీ శబరీష్ సారు. అవునా అని పర్శాన్ కాకుర్రి. మళ్లోపారి మంచిగ పరీచ్చవట్టి సూడుర్రి కావాల్నంటే..
అవ్ నిజమేగనీ., ఈ సారు ఏ ఫంక్షన్ల ఇంత జోర్దార్గ డ్యాన్సు జేశిండు అంటరా.. మైబ్బాద్ జిల్లా పోలీసులంత గల్శి పోలీసుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం పెట్టుకున్నరు. ఇగీ కార్యక్రమానికి పోలీసులంత వాల్ల కుటుంబాలను మొత్తం తీస్కోని వచ్చిర్రు. జిల్లా పోలీస్ బాస్ శబరీష్ సారు ఇంటామె స్నేహ శబరీష్ గుడ ఇదే మైబ్బాద్ జిల్లాకు కలెక్టర్ గావట్టి., ఆమె సుతం ఈ కార్యక్రామానికి హాజరువడి ఎస్పీ సారు డ్యాన్సు జేస్తుంటె మస్తు ఎంకరేజ్ జేశింది కింద కూకుండి. దినాం పోలీసు బట్టలేస్కోని ఎప్పట్కి టెన్షన్ టెన్షన్ గ కానచ్చే పోలీసులు ఇయ్యాల ఒక్కరోజు మాత్రం అవ్వన్నింటిని మర్శిపోయి మస్తుగ ఎంజాయ్ జేశిర్రు.
నిచ్చం బిజీబిజీగ గడిపే పోలీసులు.. ఈ ఒక్కరోజు మాత్రం పోలీసులమనే విషయాన్ని మర్శిపోయి అందరు గల్శి మంచిగ ధూంధాంగ డ్యాన్సులు జేస్కుంట ఆటపాటలతోని ఎంజాయ్ జేశిర్రు. వాళ్లిట్ల ఖుషీగ డ్యాన్సులు జేస్తుంటే అచ్చిన ఇంటోళ్లు సుతం కిందుండి ఎంకరేజ్ జేశిర్రు. ఇగ గీ ఇద్దరు మాత్రం డ్యూయెట్ స్టెప్పులేశిర్రు.
మొత్తానికైతే., అప్పుడప్పుడన్న ఇట్లాంటి కార్యక్రమాలు వెడ్తే., పోలీసులు కొంచెం రిలాక్స్ అయితరు. తర్వాత ఇంకింత ఉత్సాహంగ పన్జెయ్యగల్గుతరని అనవట్టిర్రు ఈ ప్రోగ్రాంను సూశ్న కొందరు పోలీసులు. మరిగ కడ్మ జిల్లాల్ల సుతం ఇసొంటి కార్యక్రమాలు వెడ్తరో ఎట్లనో సూడాలె మరి.




