News Analysis: 22A వివాదం.. పొంగులేటి రాజీనామా చేయాలి! - BJP రవి శంకర్
News Analysis: తెలంగాణలో 22A (నిషేధిత భూములు) ఆన్లైన్ అదనపు జాబితా చేర్పుల అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీస్తోంది.
News Analysis: 22A వివాదం.. పొంగులేటి రాజీనామా చేయాలి! - BJP రవి శంకర్
News Analysis: తెలంగాణలో 22A (నిషేధిత భూములు) ఆన్లైన్ అదనపు జాబితా చేర్పుల అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీస్తోంది. వేలాది ఎకరాల ప్రైవేటు ఆస్తులను, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక, సబ్-రిజిస్ట్రార్ మరియు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ వివాదంలో నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ నేత రవిశంకర్ మాట్లాడుతూ, అధికారుల పొరపాట్ల వల్ల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ‘ధరణి’ పోర్టల్ ద్వారా మొదలైన లోపాలను రెక్టిఫై చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 22A జాబితాను మరింత విస్తరించి ప్రజలకు నరకం చూపుతోందని ఆరోపించారు. సమస్య పరిష్కారం పేరుతో ఎమ్మార్వోలు, కలెక్టర్ల చుట్టూ తిప్పడం సరికాదని ఆయన మండిపడ్డారు.




