Burning Topic: బీజేపీ వ్యూహాలను చిత్తూ చేసిన ప్రియాంక గాంధీ

Burning Topic: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రియాంక గాంధీ సంచలన ప్రసంగం. బీజేపీ వ్యూహాలను ఎండగట్టిన వయనాడ్ ఎంపీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 April 2026 7:55 AM IST
Burning Topic
X

Burning Topic: బీజేపీ వ్యూహాలను చిత్తూ చేసిన ప్రియాంక గాంధీ

Burning Topic: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చతో వయనాడ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీకి దేశ వ్యాప్తంగా మరింత ప్రచారం లభించింది. ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెబుతున్నారు విశ్లేషకులు. పార్లమెంట్‌లో ఆమె చేసిన ప్రసంగం అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది. తన సోదరుడు విపక్షనేత రాహుల్ గాంధీకి ధీటుగా ప్రియంక వాగ్దాటి కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును సమర్థిస్తుందని, అయితే ఈ బిల్లు వెనుక రాజకీయ దురుద్ధేశాలను వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల మాటలపై ప్రజల్లో విశ్వాసం పోయిందంన్నారు. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై నేరుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రియాంక. ఆయన తెలివిలో చాణక్యుడ్ని మించిపోయారని అంటించారు. ప్రియాంకచేసిన వ్యాఖ్యలకు హోం మంత్రి చిరునవ్వులు చిందించారు. ఆయన నొచ్చుకున్నట్లు కనిపించలేదు.

ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో మహిళలకు ఈరోజే రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ చారిత్రాత్మక చర్యను ప్రధాని మోదీ చిత్తశుద్ధితో చేపట్టి ఉంటే, సభ మొత్తం దీనికి మద్దతు ఇచ్చేది.. నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్రాల భవిష్యత్తును, పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యాన్ని డీలిమిటేషన్ కమిషన్‌లోని ముగ్గురు సభ్యులే నిర్ణయిస్తారని స్పష్టమవుతోంది.. ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తూ, 'దేశ సమగ్రతపై పెద్ద దాడికి' పాల్పడుతోంది’’ అని ఆమె ఆరోపించారు. మొత్తం మీద ఎన్నికలలో రాజకీయ ట్రంప్ కార్డు మాదిరిగా ఈ బిల్లును వాడుకుంటున్నారని విమర్శించారు. పైకి చూస్తే ఇది బాగానే అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చదివితేనే అసలు అర్థం బయటపడుతుంది.. ఇందులో రాజకీయ వాసన వస్తోంది’’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక అమె 2024 నవంబర్‌లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు తన సోదరుడు రాహుల్ గాంధీ ఈ సీటును వదులుకోవడంతో జరిగిన ఉపఎన్నికలో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రియాంక సభలో కూడా స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, ఇతర జాతీయ అంశాలపై ఆమె ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు.

గాంధీ, నెహ్రూ పరివారం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీకి బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. అమె నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రులుగా చేశారు. తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో తెర వెనుక సారధిగా వ్యవహించారు. అయితే ఈ కుటుంబం నుంచి ముందుగా రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసినా అనుకున్నంత రాణించలేకపోయారనే వాదన ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తేలిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు ప్రియాంకను రాజకీయాల్లోకి తేవాలిన చాలా కాలంగా వత్తిడి తెచ్చారు. అప్పటి వరకూ తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన ప్రియాంక.. 2019లో ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం ద్వారా అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె వాగ్దాటి ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రియాంకా కాంగ్రెస్‌లో ఫైర్‌ఫైటర్ పాత్రలో కనిపిస్తున్నారు. 2004 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇంగ్లండ్‌లో తన ఉద్యోగాన్ని వదిలేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన ప్రొఫెషనల్ జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ చాలా గొప్ప త్యాగం చేశారని సోనియా, ప్రియాంకా భావించారు. 2019లో రాహుల్ గాంధీకి సహాయం చేయడానికి ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారు. గానీ ఆయన స్థానం తీసుకోవడానికి కాదు అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రియాంక చేసిన ప్రచారం పెద్దగా పనికి రాకున్నా, రాజకీయంగా ఆమె రాటు తేలేందుకు ఆ అనుభవం పనికి వచ్చింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story