BIG STORY: తొలి తల్లి విశ్వ సుందరిగా చరిత్ర!
BIG STORY: ప్యూర్టోరికోలో జరిగిన 75వ మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు. తల్లిగా ఉండి కిరీటం గెలిచిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
BIG STORY: తొలి తల్లి విశ్వ సుందరిగా చరిత్ర!
BIG STORY: అందాల పోటీలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోనూ విశ్వసుందరి పోటీలంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నగరంలో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ‘మిస్ యూనివర్స్ 2026’ విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో నిలిచారు. 75వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆమెను విశ్వసుందరి కిరీటం వరించింది.
కాగా గత అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఫాతిమా బోష్...ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి విజేతకు 3,150 వజ్రాలు, వైట్ గోల్డ్‌తో రూపొందించిన ప్రత్యేక కిరీటాన్ని అందించారు. ఈ మహా వేదికపై మొత్తం 116 దేశాల సుందరీమణులు పోటీపడ్డారు.
అయితే తాజా పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన మెలిస్సా న్యూసెజ్ ఫస్ట్ రన్నర్ అప్ గా అలాగే వెనెజులాకు చెందిన క్లారా గోట్జ్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు.
ఇక విజేత జెన్నిఫర్ బారెటో విషయానికొస్తే ఆమె వృత్తిరీత్యా సైకాలజిస్ట్ . అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.గతంలో కొన్ని సందర్భాల్లో అమెరికన్ సైన్యంతో కలిసి ఆమె పనిచేశారు.ఇదిలా ఉంటే, మిస్ యూనివర్స్ సంస్థ నిబంధనలను సవరించిన తర్వాత, ఒక బిడ్డకు తల్లిగా ఉండి ఈ కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాదు ప్యూర్టోరికో నుంచి ఈ టైటిల్ సాధించిన ఆరో మహిళగా జెన్నిఫర్ బారెటో రికార్డులకెక్కారు.
కాగా మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో త్వరలోనే పలు అంతర్జాతీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఇందులో భాగంగా అనే ప్రపంచదేశాల్లో ఆమె పర్యటిస్తారు.
ఇదిలా ఉంటే, భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్ 12లోకి ప్రవేశించలేకపోయారు. ఈవెనింగ్ గౌన్ రౌండ్‌కు ముందే ఆమె పోటీ నుంచి నిష్క్రమించడంతో భారత అభిమానులకు నిరాశ ఎదురైంది.




