Jordar Varthalu: అవసరమా భయ్యా మనకు ఇవన్నీ
Jordar Varthalu: పెళ్లి అంటే కార్లు, గుర్రాలు, మేళతాళాలు ఉండటం మామూలే! కానీ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఓ పెళ్లి కొడుకు తన పెళ్లికి ఏకంగా బుల్డోజర్ ఎక్కి వెళ్లాడు.
Jordar Varthalu: అవసరమా భయ్యా మనకు ఇవన్నీ
Jordar Varthalu: ఓశీ.. వీళ్ల ఆగం సల్లగుండా. బుల్డోజర్ బకిట్ల నిల్సొని, సూశెటోల్లకే శెమ్టలు పట్టిత్తున్నరు గదా ఈల్లు. రాజస్థాన్ దిక్కు ఉదయ్ పూర్ల రూప్ లాల్ అనే పెండ్లిపిలగాడు.. గీ బుల్డోజర్ నడ్పుతడట. లగ్గానికి అందరిలెక్క కార్లల్ల గాకుంట.. నేను నడిపే బుల్డోజర్లనే పోతె ఎట్లుంటదని ఇసొంటి ఇచ్చంత్రాల ఉపాయం జేశిండట. ఇగ పెండ్లిపిల్ల సుతం సరేనని తల్కాయ ఊపి, తోడి పెండ్లి పిల్లను, ఇద్దరు ముగ్గురు సుట్టాలను సుతం బకిట్ల ఎక్కిచ్చుకొని బైలెల్లిర్రు. దగ్గర్దగ్గర ముప్పై కిలోమీటర్లు ఇట్ల ఊక్కుంటనే పొయ్యిర్రు. ఇగ తొవ్వల మీద పొయ్యెటోల్లు ఈల్ల ఇచ్చంత్రాల ప్రయాణాన్ని సూశి వీడియో తీసుకొని.. పెండ్లోల్లు రాక్.. పోలీసోల్లు షాక్ అనుకుంట ఇంటర్నెట్ల వీడియోను విడుదల జేశిర్రు. ఆయింత ఎటమటమైతె.. నవ్వులు వొయ్యి నువ్వులైతయని కొందరు, పెండ్లింట సావు భాజాలకు ప్లాన్ జేశిర్రని ఇంకొందరు జనాలు కామెంట్ల వాన కుర్పిత్తున్నరు. జనాలూ.. సూశిర్రు గదా. మీరైతే గిసొంటియ్ అస్సల్కే ట్రై జెయ్యకుర్రి. ఉత్తగ పానాలను పర్శాన్ల పడేసుకోకుర్రి సరేనా.




