Off The Record: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌ మాటల వెనక మతలబేంటి?

Off The Record: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ 'అడ్డంగా నరుకుతాం' అనే వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ రగడ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 April 2026 9:30 PM IST
Off The Record
X

Off The Record: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌ మాటల వెనక మతలబేంటి?

Off The Record: రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల మంథనిలో జరిగిన దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు రీసౌండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి..? కావాలనే అన్నారో.. అనుకోకుండా మాట్లాడారో కానీ.. సినిమా స్టైల్లో చెప్పిన ఆ డైలాగ్ ఇప్పుడు రచ్చరచ్చగా మారిపోయింది. అసలే భగ్గుమనే రాజకీయాలకి పేరున్న ఆ ప్రాంతం మరోసారి మక్కాన్ సింగ్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. ఇంతకీ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story