Jordar Varthalu: అడ్డంగ మాట్లాడుతే అడ్డంగ నరికేస్తం..ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాస్ వార్నింగ్
Jordar Varthalu: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jordar Varthalu: అడ్డంగ మాట్లాడుతే అడ్డంగ నరికేస్తం..ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాస్ వార్నింగ్
Jordar Varthalu: వాయమ్మో.. అడ్డంగ మాట్లాడుతే అడ్డంగ నరుకుతమని బహిరంగంగనే వార్నింగిస్తున్నడు గదా సారు. మరీనే ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్శిపోయిండో ఏంపాడో తెల్వదిగనీ., మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావుతోనట్టుగ బొచ్చెడంత మంది కార్యకర్తలు పాల్గొన్న మీటింగుల గిట్ల వార్నింగిచ్చేటాల్లకు అక్కడున్నోళ్లు కొంత మంది నవ్వుకుంటే., శానా మంది పర్శాన్ అయ్యిర్రట. ఇగీ ముచ్చట్ల మాత్రం కారు పార్టోళ్లు బగ్గనే గరానికస్తున్నరు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అనుకుంటున్నడా లేకుంటె వీధి రౌడీ అనుకుంటున్నడా. ప్రతిపక్ష పార్టీల నాయకులను భయపెట్టేతందుకు పబ్లిక్ మీటింగులనే అడ్డంగ నరుకుతమని వార్నింగిస్తున్నడంటే., అసలు ప్రజాస్వామ్యంలనే బతుకుతున్నమా అని ప్రశ్నిస్తున్నరు. ఇగీ ముచ్చట రచ్చయ్యేటాళ్లకు మంత్రి శ్రీధర్ బాబు సారు గిట్ల కవరింగ్ జేశిండు.
గిదేంది సారు మీరు గిట్ల మాట్లాడుతున్నరు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు అడ్డంగ మాట్లాడుతె అడ్డంగ నర్కుతమని బాజాప్తా జెప్పనే జెప్పే. ఇగ మీరేమో ఓదిక్కు రాజ్ ఠాకూర్ కు అసొంటి ఉద్దేశ్యం ఉండదని అనవడ్తిరి. ఇంకో దిక్కేమో కార్యకర్తలు వాళ్ల బాధలు జెప్పుకుంటె అట్ల స్పందించిండని అనవడ్తిరి. సరే.. మీ పార్టీ కార్యకర్తలు బాధవడ్తే చట్టపరంగ, న్యాయపరంగ ముంగట్కి పోవాలే అంతేగనీ., గిట్ల బెద్రిచ్చినట్టు మాట్లాడుతే ఎట్ల సారు. అధికార పార్టీల ఉన్నప్పుడు ఎంతో ఓపికతోని ఉండాలే. శాంతి భద్రతలను కాపాడాలే. అంతేగనీ., ఎమ్మెల్యేనే ప్రజలు భయపడేతట్టు మాట్లాడుతే., ఇగ మామూలు జనాలు వాల్ల గోసను ఇంకెవ్వలి జెప్పుకోగల్గుతరు జెప్పుర్రని కోపానికస్తున్నరు కోల్ బెల్ట్ ఏరియా జనాలు.




