Burning Topic: పీకల్లోతు అప్పుల్లో అమెరికా. సుమారు 4 వేల లక్షల కోట్లు!

Burning Topic: అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు (రూ.3,896 లక్షల కోట్లకు) చేరింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2026 7:45 AM IST
Burning Topic
X

Burning Topic: పీకల్లోతు అప్పుల్లో అమెరికా. సుమారు 4 వేల లక్షల కోట్లు!

Burning Topic: పైన పటారం.. లోన లొటారం అంటే ఇదే.. ఇప్పుడు అగ్రరాజ్యం పరిస్థితి అలాగే కనిపిస్తోంది. పేరుకే సూపర్ పవర్.. కానీ ఆ దేశంలోని డొల్ల తనం ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. అప్పులు చేయకుండా బతుకీడ్చడం ఎవరికైనా కష్టమే. అది వ్యక్తులకే కాదు. కంపెనీలు, సంస్థలు, సమూహాలు, దేశాలకూ వర్తిస్తుంది చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నడవడం కుదరదు.. అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆదేశాన్ని వెంటాడుతున్న సమస్యలు అగ్రరాజ్య ప్రతిష్టకు క్రమంగా మసకబారుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికా నెత్తి మీద ఉన్న అప్పులు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంటే భారతీయ కరెన్సీలో ఏకంగా రూ.3,896 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చిలో అమెరికా అప్పు రూ.3,733 లక్షల కోట్లు కాగా.. ఐదు నెలల్లోనే సుమారు మరో రూ.163 లక్షల కోట్లు అప్పులు చేసింది

అగ్రరాజ్యం అప్పుల్లోనూ కొత్త రికార్డును సృష్టించింది తన రికార్డులను తానే బద్దలుకొడుతోంది.. అమెరికా ఆర్థికవ్యవస్థపై అప్పుల భారం మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరిందని ఆ దేశ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. రాబడికి మించి విపరీతంగా పెరిగిపోతున్న ప్రభుత్వ ఖర్చులు, పన్ను కోతలు, వడ్డీ భారం వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం వసూలు చేసే పన్నుల కంటే ఖర్చులే ఎక్కువగా ఉండటంతో ప్రతి ఏటా బడ్జెట్ లోటు పెరిగిపోతోంది. వృద్ధాప్య జనాభా పెరగడంతో సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సంక్షేమ పథకాల వ్యయం విపరీతంగా పెరిగింది. రక్షణ రంగానికి చేసే భారీ కేటాయింపులు, పన్ను కోతల చట్టాలు ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని తగ్గించి, లోటును మరింత పెంచాయి.

ఈ మధ్య కాలంలో అమెరికా అప్పుల భారం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కేవలం గత ఐదు నెలల్లోనే జాతీయ అప్పు వన్ ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఇదే తీరు కొనసాగితే ఆరేళ్లలో ఈ అప్పు 50 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ హెచ్చరించింది. పదేళ్ల క్రితం ఈ అప్పు 20 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువే ఉండేది. 2023 మే లో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం 2028 నాటికి 40 ట్రిలియన్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు. అయితే అనుకున్న దానికంటే ముందే ఈ గండం ముంచుకొచ్చింది. ప్రస్తుతం పాత అప్పులు తీర్చడానికి, వడ్డీలు చెల్లించడానికే అమెరికా మళ్లీ కొత్తగా అప్పులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. 2026 మొదటి 10 నెలల్లోనే నికర వడ్డీ చెల్లింపులు 963 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది అమెరికా జాతీయ రక్షణ బడ్జెట్ కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం, 2026 నాటికి అమెరికా బడ్జెట్ లోటు 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది.

ఇరాన్‌పై యుద్ధంతో రక్షణ వ్యయం భారీగా పెరగడం, సంక్షేమ కార్యక్రమాల కోసం చెల్లింపులు, రుణాలపై వడ్డీల చెల్లింపుల కోసం రుణసేకరణ పెరిగిందని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వసూలు చేసే పన్నుల కంటే ఖర్చులే ఎక్కువగా ఉండటంతో ప్రతి ఏటా బడ్జెట్ లోటు పెరిగిపోతోంది. కాగా అమెరికా ప్రభుత్వ అప్పులు రుణాలు పెరుగుతున్నా.. అవి జీడీపీ-రుణ నిష్పత్తికి లోబడే ఉన్నాయని శ్వేతసౌధం ప్రతినిధి కుష్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయంలో వృధాను, దుర్వినియోగాన్ని, మోసాన్ని అరికట్టే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం సరైన చర్యలు చేపడుతోందని తెలిపారు. అయితే పెరుగుతున్న రుణాల కారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగి.. సాధారణ ప్రజలపై, వ్యాపారాలపై ప్రభావం పడుతోందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా రుణభారంలో ఉన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story