Big Debate: రేవంత్ రెడ్డి ఎదుగుదలను అడ్డుకునేందుకే విదేశీ పర్యటనకు బ్రేక్?: హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో మాజీ ఐఎఫ్‌ఎస్ వినోద్ కుమార్
Big Debate: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ ‘పొలిటికల్ క్లియరెన్స్’ నిరాకరించడంపై హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) బిగ్ డిబేట్‌లో మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వినోద్ కుమార్ విశ్లేషణ.
Big Debate: రేవంత్ రెడ్డి ఎదుగుదలను అడ్డుకునేందుకే విదేశీ పర్యటనకు బ్రేక్?: హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో మాజీ ఐఎఫ్‌ఎస్ వినోద్ కుమార్
Big Debate: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ (విదేశాంగ శాఖ అనుమతి) నిరాకరించడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో మాజీ రాయబారి, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ (IFS) అధికారి మరియు కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వినోద్ కుమార్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
పూర్వం విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కోఆర్డినేషన్ డివిజన్‌కు నేతృత్వం వహించిన కాలంలో తానే స్వయంగా పలువురు ప్రముఖుల పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్సెస్ మంజూరు చేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు. సరైన ప్రాతిపదిక, తగిన ఆధారాలు లేని పక్షంలో గవర్నర్లు లేదా న్యాయమూర్తుల పర్యటనలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్లే ముఖ్యమంత్రుల పర్యటనలను నిలిపివేయడం అరుదని పేర్కొన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడితో సహా అనేకమంది ముఖ్యమంత్రుల పర్యటనలను కేంద్రం అమోదించి విజయవంతం చేసిందని గుర్తుచేశారు.




