News Analysis: రేవంత్ రెడ్డిది 'పెన్షన్ చోర్' ప్రభుత్వం.. BRS నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేత దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 12:04 PM IST
News Analysis
X

News Analysis: రేవంత్ రెడ్డిది 'పెన్షన్ చోర్' ప్రభుత్వం.. BRS నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, వృద్ధులు మరియు వికలాంగుల హక్కులను కాలరాస్తోందని, పెన్షన్ల నిధులను దారి మళ్లిస్తూ 'పెన్షన్ చోర్ ప్రభుత్వం'గా మారిందని బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు దత్తాత్రేయ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన ‘న్యూస్ ఎనాలసిస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు ముందు ఆసరా పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అంతేకాకుండా, ప్రతి నెలా సుమారు ₹900 కోట్లు కేటాయించాల్సిన పెన్షన్ నిధుల్లో బకాయిలు పెడుతూ, పేదలకు చెందాల్సిన సొమ్మును దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story