Off The Record: కాంగ్రెస్ పెద్దోళ్ళ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయా!

Off The Record: సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య విభేదాలు వస్తున్నాయంటూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2026 6:57 AM IST
Off The Record
X

Off The Record: కాంగ్రెస్ పెద్దోళ్ళ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయా!

Off The Record: నాడు దోస్తీ.. నేడు కుస్తీ.!? సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ మధ్య గ్యాప్‌ పెరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇటు పార్టీ, ప్రభుత్వంలో నియామకాలు, అటు నేతల వర్గపోరుపై టీపీసీసీ ప్రేక్షకపాత్ర లాంటి పరిణామాల వల్లే ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తమ మధ్య విభేదాలు లేవని పీసీసీ చీఫ్ క్లారిటి ఇస్తున్నా.. ప్రచారానికి మాత్రం బ్రేక్‌లు పడటం లేదు. నిప్పు లేనిదే పొగ కాదు కదా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి. సూపర్‌ హిట్ కాంబినేషన్‌ అనిపించుకున్న రేవంత్, మహేశ్ గౌడ్ మధ్య నిజంగానే మనస్పర్ధలు పొగ చూరాయా..? లేక ఇది ప్రత్యర్తుల అసత్య ప్రచారమేనా.?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story